9వ తరగతి బాలికకు హార్ట్ ఎటాక్ ఎగ్జామ్ సెంట‌ర్ లో మృతి

ఎవ‌రిని ఎప్పుడు క‌దిలిస్తుందో ఈ గుండెపోటు. ఈ మ‌ధ్య‌కాలంలో చిన్న వ‌య‌స్సులోనే హార్ట్ఎటాక్ తో చ‌నిపోతున్నారు. కొన్నేండ్ల క్రితం వ‌ర‌కు వ‌య‌స్సు మీద ప‌డిన వారికే గుండె పోటు వ‌చ్చేది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రాణాలు తీస్తోంది. ఆడుతూనో, పాడుతూనో, చూస్తు ఉండ‌గానే చాలా మంది కుప్ప‌కూలిపోతున్న ఘ‌ట‌న‌లెన్నో.. అటువంటి ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అమ్రేలి న‌గ‌రంలో 9 వ‌త‌ర‌గ‌తి చ‌దువుతున్నసాక్ష్‌ రాజోసరగా అనే బాలిక ఎగ్జామ్ రాసేందుకు హాజ‌రైంది. కొద్దిసేప‌టి తరువాత హ‌ఠాత్తుగా కుప్ప‌కూలిపోయింది. ఉపాధ్యాయులు వెంట‌నే ఆమెను ద‌వాఖానాకు తీసుకెళ్లిన లాభం లేక‌పోయింది. అప్ప‌టికే మృతి చెందిన డాక్ట‌ర్ల చెప్పారు. గ‌డిచిన రెండుమూడేండ్ల‌లో గుండెపోటు మ‌ర‌ణాలు తీవ్ర‌మ‌య్యాయి.

 

నేపాల్‌లో భారీ భూకంపం 128 మంది మృతి

కారులో లిక్క‌ర్‌.. అందిన‌కాడికి సంక‌లేసుక‌పోయారు. వీడియో వైర‌ల్

నాభ‌ర్త‌ను చంపేయి.. సింగ‌రేణి ఉద్యోగం చేసుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *