Tuesday , 25 June 2024
Breaking News

నేపాల్‌లో భారీ భూకంపం 128 మంది మృతి

ప్ర‌కృతి విరుచుక‌ప‌డుతోంది. ప్ర‌పంచంలో ఏదో ఓ చోట ప్ర‌కృతి ప‌గ‌బట్ట‌న‌ట్టు శిక్షిస్తోంది. వ‌ర‌ద‌లు, క‌రువు, ఇత‌ర వైప‌రీత్యాల‌తో జీవ‌రాశి మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్న‌ర్థ‌కంగా మారుస్తోంది. అటువంటి విషాదమే నేపాల్లో చోటు చేసుకుంది. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి భారీ భూ కంపం సంభ‌వించింది. దీని తీవ్ర‌త 6.4 ఉంటుందిన రెస్క్యూ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. నేపాల్ దేశంలోని వాయువ్య జిల్లాలో ఈ భూకంపం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 128 మంది మృతి చెందిన‌ట్టు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. శుక్ర‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో భూకంపం రావ‌డంతో అనేక ఏరియాల‌తో క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ తెగిపోయింది. 11 మైళ్లలోతులో భూకంప కేంద్రం ఉన్న‌ట్టు జియోలాజిల్ సంస్థ వారు గుర్తించారు. మొద‌ట దీని తీవ్ర‌త 5.6 గా అంచ‌నా వేశారు. రాత్రి స‌మ‌యం కావ‌డంతో తీవ్ర‌త తెలియ‌రాలేద‌ని వారు వివ‌రించారు. ఆదేశ క్యాపిట‌ల్ సిటీ ఖాట్మండ్ కు 400 కిలోమీట‌ర్ల దూరంలోని జాజ‌ర్ కోట లో భూకంప కేంద్రం ఉంద‌ని గుర్తించారు. రుక‌మ్ అనే జిల్లాలో ఇండ్లు కూలయి. ఈ జిల్లాలోనే 35 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 34 మంది జాజ‌ర్ కోట‌లో మృతి చెందార‌ని స‌మాచారం. దీని తీవ్ర‌త ఇండియాలోని అనేక ప్రాంతాల్లో క‌నిపింది. నేపాల్ కు 800 కి.మీ దూరంలో ఉన్న మ‌న‌దేశ రాజ‌ధాని ఢిల్లీలో కూడా ప్ర‌కంప‌నాలు వ‌చ్చాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ట్రాల్లోనూ భూకంపించింది. భూమి క‌దులుతున్న‌ట్టు అవ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతులు గురుయ్యారు.
మృతి చెందిన‌వారి కుటుంబాల‌కు నేపాల్ ప్ర‌ధాన మంత్రి పుష్ఫ‌క‌మ‌ల్ సంతాపం ప్ర‌క‌టించారు.

నేపాల్‌లో సంభ‌వించిన భూకంపం కార‌ణంగా జ‌రిగిన ప్రాణ‌న‌ష్టంపై భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి తీవ్ర దిగ్భాంతి తెలిపారు. వారికి భార‌త్ అండ‌గా ఉంట‌ద‌ని మోడీ త‌న ఎక్స్ ఖాతాలో తెలిపారు. మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. మృతి చెందిన వారి కుటుంబాల‌కు సంతాపం తెలిపారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

కారులో లిక్క‌ర్‌.. అందిన‌కాడికి సంక‌లేసుక‌పోయారు. వీడియో వైర‌ల్

టికెట్ రాలేద‌ని శ్మ‌శానంలో నిద్ర‌

ఎంఐఎం అభ్య‌ర్థులు వీరే.. కొత్త‌గా రెండు స్థానాల్లో పోటీ, పాతోళ్లు ఇద్ద‌రు పోటికి దూరం

బీజేపీ మూడో విడ‌త ఎమ్మెల్యే అభ్య‌ర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..

నాభ‌ర్త‌ను చంపేయి.. సింగ‌రేణి ఉద్యోగం చేసుకుందాం

About Dc Telugu

Check Also

Viral video

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Viral video” ఈ మ‌ధ్య యువ‌త రీల్స్ కోసం ఎంత‌టి సాహసాలకైనా వెనుకాడ‌డం లేదు. మొన్న పూణేలోని ఓ ఎత్త‌యిన …

Video viral

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Video viral” రీల్స్ చేయ‌డం… ఫేమ‌స్ అవ‌డం.. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌.. సాధార‌ణంగా కొన్ని ప‌నులు చేయ‌డానికి కొంత …

tribal women

tribal women” ఆదివాసి మ‌హిళ‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆర్థిక సాయం ప్ర‌కటించిన మంత్రి జూప‌ల్లి

tribal women” నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ‌లం మొలచింత‌లప‌ల్లి ఆదివాసీ మ‌హిళ‌పై దారుణంగా దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com