ప్రపంచకప్ 2023 ముచ్చట ఇంకా మరిచిపోనేలేదు. మరో సమరానికి తెరలేసింది. రేపటి నుండి (నవంబర్ 23) నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ ట్వంటీ 5 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ డిసెంబర్ 3న జరగునుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ సహా పలువురు క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చారు. మొత్తంగా యువ ఆటగాళ్లు బరిలోకి ఉండనున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ, యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ జట్టులో అవకాశం లభించింది. వికెట్ కీపర్‌గా సంజు శాంసన్ తిరిగి వస్తాడననుకున్నారు. కానీ జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా సెలెక్టు అయ్యాడు. ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోరు వంటి వారు బౌలర్లుగా వచ్చారు.
ఫస్ట్ మ్యాచ్- 23 నవంబర్, రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం.
సెకెండ్ మ్యాచ్- 26 నవంబర్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.
థర్డ్ మ్యాచ్- 28 నవంబర్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి.
ఫోర్త్ మ్యాచ్- 01 డిసెంబర్, విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, నాగ్‌పూర్.
ఐదో మ్యాచ్- డిసెంబర్ 03, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.
జట్టులో ఉన్నవారు…
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లిస్, తన్వీర్ సంఘా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపా.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోరు, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
బౌలర్లకు కొత్త రూల్.. లేట్ చేస్తే జరిమానా.. అలా చేయించుకుంటే అనర్హులు
భారత అభిమానులు క్షమించండి.. డేవిడ్ వార్నర్ ట్వీట్!
ఇంత అహమా.. వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టిన ఆసీస్ క్రికెటర్లు.. 2007లోనూ ఇంతే