బైక్‌ను ఢీకొట్టిన స్కూలు బస్సు కూతురు మృతి.. తండ్రికి గాయాలు

ములుగు : ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని ఓ స్కూలు బస్సు ఢీ కొట్ట‌డంతో ఏడాది వ‌య‌స్సు గ‌ల కూతరు మృతి చెందింది. ఆ పాప తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన సమ్మక్క, సారక్క తాడ్వాయి మండలం నార్లపూర్‌ గ్రామంలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. వివ‌రాల ప్ర‌కారం.. గ్రామానికి చెందిన ఖాతా రమేష్‌ ఏడాది వయసు గల తన కూతరుతో బైక్‌పై వెళ్తుండగా వారి ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని స్కూలు బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాప అక్కడికక్కడే మృతి చెందింది. రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ములుగు గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

న‌డి స‌ముద్రంలో హాలీవుడ్ సినిమా రేంజ్‌లో హెలికాప్టర్‌తో దాడి ఎటాక్‌… వీడియో రిలీజ్ చేసిన తిరుగుబాటు దారులు

సినిమా షూటింగ్‌లో హీరో సూర్య‌కు గాయాలు

ఒక‌టే కుటుంబంలో అంద‌రికీ ఆరువేళ్లు… ఇప్ప‌టి వ‌ర‌కు 150 మందికి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *