Iran president” హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని స్థానిక విూడియా ధృవీకరించింది. అధ్యక్షుడితో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా ఈ ఘటనలో చనిపోయారు. ఓ ఆనకట్ట ప్రారంభానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ అదుపు తప్పి, తూర్పు అజర్‌బైజాన్ సరిహద్దుల్లోని జోల్ఫా ప్రాంతంలో కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ మొత్తం కాలిపోవడంతో.. అందులో ఉన్న వ్యక్తులందరూ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం అక్కడ ఇతర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం అజర్‌బైజాన్ సవిూపంలో ఇరుదేశాలు సంయుక్తంగా నిర్మించిన ఓ ఆనకట్ట ప్రారంభోత్సవానికి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకొని అధ్యక్షుడు హెలికాప్టర్‌లో తబ్రిజ్ నగరానికి తిరుగు పయనమయ్యారు. అయితే.. భారీ పొగమంచు మధ్య పర్వతప్రాంతాలను దాటుతున్న సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పి, జోల్ఫా ప్రాంతంలో నేలను బలంగా తాకింది. దీంతో.. హెలికాప్టర్‌లో మంటలు చెలరేగి, పూర్తిగా దగ్ధమైంది. హెలికాప్టర్ గల్లంతైన విషయం తెలియగానే.. అధికారులు అప్రమత్తమై దాని ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతికూల వాతావరణ నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మానవరహిత విమానాల ద్వారా ప్రమాద స్థలాన్ని గుర్తించి.. సోమవారం ఉదయం రెస్క్యూ బందాలు అక్కడికి చేరుకున్నాయి. ఇబ్రహీం రైసీ మృతితో ఇరాన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి ఇబ్రహీం రైసీ అత్యంత సన్నిహితుడు. 2021 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. అయితే.. తన ప్రత్యర్థుల్ని పక్కకు తప్పించి, ఆయన తక్కువ ఓటింగ్‌తో ఈ ఎన్నికల్లో గెలుపొందడం.. అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఖమేనీకి వారసుడిగా గుర్తింపు పొందిన ఇబ్రహీం.. 1988లో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు ఆంక్షల్ని ఎదుర్కొంటున్నారు. తాను అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరాన్‌లో ఇస్లామిక్ చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించారు. తన హయాంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేశారు. ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా మారుస్తానని పదేపదే చెప్పేవారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ విూడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ఇబ్రహీం రైసీ మృతి విచారకరం. రైసీ మరణ వార్త తనను తీవ్ర దిగ్బాంక్ష్మి-రతికి గురిచేసింది. ఇరాన్- భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం రైసీ చేసిన కృషిని మరవలేం. రైసీ కుటుంబ సభ్యులు, ఇరాన్ ప్రజలకు సంతాపం తెలియజేస్తున్నా. ఈ కష్ట సమయంలో ఇరాన్‌కు భారతదేశం అండగా నిలుస్తోంది అని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హెచ్ అవిూర్ మృతి తనను తీవ్రంగా కలచి వేసింది. ఆ ఇద్దరు నేతలతో పలు సమావేశాల్లో పాల్గొన్నా. ఈ జనవరిలో ఓ సమావేశంలో కలిశాం. ఇద్దరు నేతల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. ఈ కఠిన సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలబడతాం అని’ విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన బస్సు..
Taiwan Parlement”పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు
Khammam Cirme News” ఆస్తి కోసం కన్నతల్లిని, కన్న కూతుళ్ల హత్య
Fire Accdent” బస్సు దగ్ధం.. కాలిబూడిదైన 8 మంది..
Serial Actor”త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
Old Courtallam Falls Flood” జలపాతం వద్ద ఆకస్మికంగా పెరిగిన వరద… బాలుడు మిస్సింగ్.. వీడియో
Bull Viral video” ఫోన్ ఆడిక్షన్ ప్రాణం మీదకు తెచ్చింది. కుళ్లపొడిచిన ఎద్దు.. వీడియో వైరల్
Rajanna Siricilla Crime news”పిగుడుపాటుకు ఇద్దరు మృతి