కేంద్ర‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్సీ క‌విత ఆగ్ర‌హం

రాజ్య‌స‌భ‌లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నెలస‌రి విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. నెల‌సరి రోజుల్లో వేత‌నంతో కూడిన సెల‌వు అవ‌స‌రం లేద‌ని కేంద్ర మంత్రి అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్సీ క‌విత మండిప‌డ్డారు. ఎక్స్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. రుతుస్రావం రోజుల‌కు వేత‌నంతో కూడిన సెల‌వుల‌ను తిర‌స్క‌రించ‌డం మ‌హిళ‌ల నిజ‌మై బాధ‌ను విస్మ‌రించ‌డమే అన్నారు. ఇటువంటి వ్యాఖ్యల‌ వ‌ల్ల తాను నిరుత్సాహ ప‌డ్డాడ‌ని పేర్కొన్నారు.ఒక మ‌హిళ‌గా ఇట్లాంటి అజ్ఞానాన్నిచూడ‌టం చాలా భ‌య‌క‌రంగా ఉంద‌న్నారు. నెల‌స‌రి ఒక ఎంపిక కాద‌ని తెలిపారు. మ‌న‌పోరాటాల‌కు, మ‌న ప్ర‌యాణాలు ఓదార్పు కాద‌ని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ఇవి కూడా చ‌దవండి

క‌లెక్ట‌ర్ గ‌న్‌మెన్ ఆత్మ‌హ‌త్య

య‌శోద ఆస్ప‌త్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జి

మాజీ ఎమ్మెల్యేల‌కు భ‌ద్ర‌త తొల‌గింపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *