ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోట్లు ఎక్కువవుతున్నాయి. స్టేజ్‌పైన పాట పాడుతున్న సింగర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడికి వచ్చిన వారంతా షాక్ గురయ్యారు. ఈ ఘటన బ్రెజిల్‌లోని ఫీరా ఢి శాంటాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…. బ్రెజిల్ కు చెందిన గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ లైవ్‌లో ప్రదర్శన ఇస్తున్నారు.ఈ క్రమంలో పెడ్రోహెన్రిక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వారంత అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అతడి వయస్సు 30 ఏండ్లు కావడం గమనార్హం.
Em Feira de Santa na Bahia, numa transmissão ao vivo, teve um infarto fulminante e morreu no palco. pic.twitter.com/191Edep7ZD
— Claudio sem acento 😎 (@claudiopedrosa8) December 14, 2023
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం