రోడ్‌సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా అంజనీకుమార్
హోంగార్డు ఐజిగా స్టీఫెన్ రవీంద్ర
జైళ్లశాఖ ఐజిగా సౌమ్యామిశ్రా
హైదరాబాద్ రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. రోడ్ సేప్టీ అథారిటీ చైర్మన్‌గా మాజీ డిజిపి అంజనీకుమార్‌ను నియమించింది.
చైనాలో తీవ్ర భూకంపం 116మంది మృతి
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా రాజీవ్ రతన్‌ను నియమించింది. ఎన్నికల ఫళితాల సమయంలో ఇసి ఆదేశాల మేరకు నియమితులైన రవిగుప్తాను కొనసాగించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపోతే గతంలో సైబరాబాద్ సిపిగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రను హోంగార్డు ఐజీగా నియిమించారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి,. ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ సీఐడీ డీజీగా రమేశ్ నాయుడు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రమేశ్, ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్. శ్రీనివాస్ సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్ చంద్ర, ఎస్‌బీఐ చీఫ్‌గా సుమతి నియమితులయ్యారు. ఇకపోతే కీలకమైన ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. గతంలో ఆయన నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. పోలీస్ అకాడవిూ డైరెక్టర్‌గా అభిలాష్ బిస్తా, జైల్స్ డీజీగా సౌమ్య మిశ్రా,సీఐడీ చీఫ్‌గా షికా గోయల్ అలాగే సైబర్ సెక్యూరిటీ అడిషనల్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రైల్వేస్ అండ్ రోడ్డు సేప్టీ అడిషనల్ డీజీపీగా మహేష్ భగవత్, ఎస్‌పిఎపఫ్ డీజీగా అనిల్ కుమార్, హైదరాబాద్ రేంజ్ ఐజీగా చంద్రశేఖర్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఎం. రమేష్, సీఐడీ డీఐజీగా రమేష్ నాయుడు బదిలీ కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ నియామకం అయ్యారు. ఇంటెలిజెన్స్ డీఐజీగా సుమతి, సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్‌చంద్ర పవర్ నియమితులయ్యారు. అలాగే పలువురు ఐపిఎస్‌లకు పదోన్నతులు దక్కాయి.
చైనాలో తీవ్ర భూకంపం 116మంది మృతి
సీరియల్ కిల్లర్ బృందం అరెస్ట్ వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ
బీఆర్ఎస్ ను బీజేపీకి ‘బీ’ టీమ్ అని అందుకే అంటారు కేటీఆర్.. కర్ణాటక సీఎం రీ ట్వీట్