Harish Rao Pressmeet” చేతకాకపోతే రేవంత్ రాజీనామా చేయ్.. నేను ముఖ్యమంత్రినయి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లందించి చూపిస్తానని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు నష్టం వాటిల్లకుండా కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ పనులు చేపట్టి సాగునీరు అందించాలని సర్కారును కోరుతన్నామన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. వాళ్లకు చేతకాకపోతే రేవంత్‌ను రాజీనామా చేయమను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చూపిస్తానని హరీశ్‌రావు సవాల్ విసిరారు. మేం రిజర్వాయర్లు నింపి పెట్టినమని తెలిపారు. అందుకే యాసంగికి నీళ్లు పోతున్నాయని అందులో ఏం ఇబ్బంది లేదన్నారు. వచ్చే యాసంగికి నీళ్లు రాకపోతే కేసీఆర్ ఉండంగా నీళ్లు వచ్చినయి.. ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని ప్రజలు ఆలోచించరా..? అని హరీశ్‌రావు అడిగారు. ఇప్పటికీ నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంది. అదే విషయాన్ని ఇంజినీర్లు కూడా చెబుతున్నారు. వాళ్లకు చేతకాకపోతే మాకు ప్రభుత్వాన్నికి అప్పజెప్పమనండి. మేం చేసి చూపిస్తాం. రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమను. నేను ఎక్కి చేపిస్తా. రేవంత్‌ను దిగమను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చూపిస్తా. నాకు మద్దతు ఇస్తా అంటే ఐయామ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేతకాదు.. హరీశ్‌రావు నీవు చేయి అంటే చేసి చూపిస్తా. రైతులకు నష్టం కలగకుండా పునరుద్ధరణ చర్యలు చేపట్టమని కోరుతున్నామని సూచించారు.
రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి కాళేశ్వరం మరమత్తు చేసి చూపిస్తా – హరీష్ రావు pic.twitter.com/OqPl2nAB1u
— Telugu Scribe (@TeluguScribe) February 14, 2024
ఇవి కూడా చదవండి
కానిస్టేబుల్ వేలు కొరికిన వ్యక్తి.. వీడియో వైరల్
Raghunandan rao” టైంపాస్ వద్దు.. యాక్షన్ కావాలి: మాజీ ఎమ్మెల్యే రఘునందనర్‌రావు
Raghunandan rao” టైంపాస్ వద్దు.. యాక్షన్ కావాలి: మాజీ ఎమ్మెల్యే రఘునందనర్‌రావు