YS Sharmila” మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఇన్నాళ్లు గుడ్డిగుర్రాల పండ్లు తోమిన‌ట్టః వైఎస్ ష‌ర్మిల

YS Sharmila

YS Sharmila”  ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే… ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ..? అని వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తారు. 5 ఏండ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని విమ‌ర్శంచారు.. రాష్ట్రానికి రాజధాని లేదు.ప్రత్యేక హోదా రాలేదు.ప్రత్యేక ప్యాకేజీలు లేవు.పోలవరం పూర్తి కాలేద‌ని పేర్కొన్నారు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదు.కొత్త పరిశ్రమలు లేవు.ఉన్నవి ఉంటాయో లేదో తెలియద‌ని ఎద్దెవా చేశారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్ర ప్రదేశ్ చేశారే తప్పా…అభివృద్ధి చూపలేదు.మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థిత‌ని వాపోయారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే…మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అంటూ విమ‌ర్శించారు. పూటకో మాట,రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశ‌మ‌ని రాసుకొచ్చారు. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా వైసీపీ కి రాజధానిపై,రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేద‌ని పేర్కొన్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Harish Rao Pressmeet” రేవంత్ రాజీనామా చేయ్‌.. నేను ముఖ్య‌మంత్రిన‌యి చేసిచూపిస్తా.. మాజీ మంత్రి హరీశ్ రావు

కానిస్టేబుల్ వేలు కొరికిన వ్య‌క్తి.. వీడియో వైర‌ల్

Raghunandan rao” టైంపాస్ వ‌ద్దు.. యాక్ష‌న్ కావాలి: మాజీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న‌ర్‌రావు

Medaram Jatara” మేడారం వెళ్ల‌లేక పోతున్నారా.. ఓ గుడ్ న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *