Maharastra crime news”సరదా కౌగిలింత‌నో… ప్రాంక్ వీడియోనో కానీ మ‌హిళ ప్రాణం తీసింది.. వీడియో

Maharastra crime news

Maharastra crime news” చిన్న చిన్న నిర్ల‌క్ష్యాల‌ను నిండు ప్రాణాల‌ను బ‌లితీసుకుంటున్నాయి. స‌ర‌దాగా చేసిన ప‌నులే ప్రాణాల‌కు ముప్పు వాటిల్లుతుంది. మహారాష్ట్ర లోని థానే లో మూడో అంతస్తు పిట్ట గోడ పై కూర్చున్న మహిళను ఆమె స్నేహితుడు సరదాగా కౌగిలించుకొబోయాడు.. ఈ క్రమంలో మహిళ స్కిడ్‌యి కింద పడి మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబై ద‌గ్గ‌ర డోంబీ వాలీ ప్రాంతంలోని గ్లోబ్ స్టేట్ బిల్డింగ్‌లో నాగిని దేవీ మంజీరామ్ వాచ్‌మ‌న్ గాప‌నిచేస్తున్న‌ది. ఈ క్ర‌మంలో బిల్డింగ్‌లోని మూడ‌వ అంత‌స్తు బాల్క‌నీ గోడ మీద నాగినీదేవీ కూర్చున్న‌ది. తోటి ఉద్యోగి ఆట‌ప‌ట్టిందామ‌ని ప్రాంక్ చేద్దామ‌ని ప‌ట్టుకున్నాడో, స‌ర‌దాగా కౌగిలించుకునేందుకు ప్ర‌య‌త్నించాడో తెలియ‌దు. అత‌డు ఆమెను ప‌ట్టుకోగానే ఆమె జారీ కింద‌ప‌డ‌బోయింది. అత‌ను ఆమెను కాపాడేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లితంలేదు. మూడో అంత‌స్తు నుంచి నాగిని దేవీ కింద‌ప‌డి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Suryapeta crime”చుట్ట‌పు చూపుగా వ‌చ్చి… మృత్యు ఒడికి

Adilabad Crime News” ఆదిలాబాద్‌లో దారుణం.. భార్య గొంతు కోసి చంపేసి.. భర్త కూడా ఆత్మహత్యాయత్నం

khammam crime news” భార్యాపిల్ల‌ను చంపి… ప్ర‌మాద‌మ‌ని చిత్రీక‌రించి..

Kothur Junction” డీసీఎం యూట‌ర్న్‌.. లారీ అదుపు తప్పి మ‌రో లారీని ఢీ… స్కూటీ మీద వెళ్తున్న వ్య‌క్తి మృతి.. వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *