Bus Accident” ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భీంపూర్ మండలంలోని కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న బక్కి అనిల్ కు చెందిన పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. అందులో కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది. కాగా ప్రమాద ఆ సమయంలో ఆర్టీసీ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి
Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన తమ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.
RoadSafety” పార్క్ చేసిన వాహనాల దగ్గర ఉంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి..
Whale Viral Video” బోటుపై దాడి చేసిన భారీ తిమింగలం.. వీడియో వైరల్
Fire Accident” హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి
Budget 2024″ బడ్జెట్ 2024 కొత్త పన్ను విధానంలో శ్లాబులు మారినయ్