Wednesday , 15 January 2025
Breaking News
Kumaradevam Tree

Kumaradevam Tree” ఆ చెట్టు మ‌ర‌ణించింది… మూడు వంద‌ల సినిమాల్లో న‌టించిన చెట్టు

Kumaradevam Tree” ఆ చెట్టు చ‌నిపోయింది. అవును చ‌నిపోయింది చెట్టే.. చెట్టు చ‌నిపోతే వార్తేందీ అనుకుంటున్నారా.. ఆ చెట్టు అలాంటి ఇలాంటి చెట్టు కాదు. మూడు వంద‌ల తెలుగు చిత్రాల్లో న‌టించిన చెట్టు. ఒక్క సినిమాలో న‌టించిన యాక్ట‌ర్ చ‌నిపోత‌నే చాలా బాధ‌ప‌డుతాం. అటువంటిది మూడు వందలకుపైగా సినిమాల్లో నటించిన చెట్టు గురించి చెప్పుకోకుండా ఉంటామా..? గోదావరి గట్టున ఉండే ఈ చెట్టు సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క‌రికీ తెలిసిందే ఈ చెట్టు. ఎన్నో తెలుగు సినిమాల్లోని కీలక సన్నివేశాలు ఈ చెట్టు కిందనే షూటింగ్ చేశారు. ఇదే చెట్టు కింద ఎన్నో కథలు కీలక మలుపులు తిరిగాయి. అంత‌టి ఘ‌న చ‌రిత్ర ఉన్న చెట్టు ఇప్పుడు నేల‌కొరిగింది. ఆ చెట్టు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో చెట్టు ఉంది. కానీ గోదావ‌రి వ‌ర‌ద‌తో ఈ చెట్టు కూలిపోయింది. అక్క‌డి వారు ఈ చెట్టును సినిమా చెట్టు అని పిలుస్తారు. ఈ చెట్టు కింది.  పాడిపంటలు, వంశవృక్షం, హిమ్మత్ వాలా,సీతారామయ్యగారి మనవరాలు దేవత, బొబ్బిలి రాజా ఇలా మూడువంద‌ల దాకా ఇక్క‌డ షూటింగ్ జ‌రిగాయి. ఈ చెట్టు 145 ఏండ్ల వ‌య‌స్సు ఉంటుంది. వంశీ దర్శకత్వంలో 18 చిత్రాల షూటింగ్ జ‌రిగింది. పాడి పంట‌లు ఇరుసులేని బండి ఈశ్వరుని బండి పాటను చిత్రీక‌ర‌ణ చేశారు. సీతా రామయ్య గారి మనవరాలు సినిమాలో సమయానికి.. గోదావరి లో ఉప్పొంగేలే గోదావరి లాంటి పాటలు కూడా ఇక్క‌డే షూటింగ్ జ‌రిగింది. ఎన్నో వరదల‌ను, తుఫాన్లను, తట్టుకుని నిల‌బ‌డ్డ ఈ చెట్టు ఇక లేద‌నే వార్త నిజంగా బాధాకర‌మ‌ని ప‌లువురు వాపోతున్నారు.

 

Image

 

ఇవి కూడా చ‌దవండి

Rajastan Viral Video” డ్యాన్స్ చేస్తూ చ‌నిపోయిన టీచ‌ర్‌.. వీడియో వైర‌ల్

Cloudburst” తెల్లారేస‌రికి గ్రామమే కొట్టుకుపోయింది.. ఒక్క‌టే ఇల్లు మిగిలింది.

Kanpur Accident” కారుతో మైన‌ర్ల స్టంట్‌.. స్కూటీకి ఢీ కొడితే త‌ల్లి మృతి.. కూతురు సీరియ‌స్‌.. సీసీ వీడియో

Khammam News” అతివేగం… ఆగిఉన్న లారీని ఢీ కొట్టి ముగ్గురు మృతి.. వీడియో

About Dc Telugu

Check Also

Game Changer Movie

Game Changer Movie” గేమ్ చేంజ‌ర్ .. అర్థం చేసుకుంటే స‌మాజ చేంజ‌ర్‌..ఇది రివ్యూకాదు.. బాగుంద‌ని చెప్పే మాట‌

Game Changer Movie”  ఎన్నో సినిమాలు చూస్తాం.. చూసి (enjoy) ఎంజాయ్ చేస్తాం. కానీ కొన్నిసినిమాలు మాత్రం మ‌న‌సుకు హ‌త్త‌కుంటాయి. …

14.01.2025 D.C Telugu Cinema

12.01.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com