Bangalore Highway Accident” ఒక‌దానికొక‌టి ఢీకొన్న 8 కార్లు.. 4 లారీలు.. ఒక‌రు స్పాట్ డెడ్.. ఇగో వీడియో

Bangalore Highway Accident

Bangalore Highway Accident” బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ప్రమాదంలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంస‌మ‌య్యాయి. ఒకరు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న బెంగళూరు – క్రిష్ణగిరి మార్గంలోని హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి ఈ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. బెంగళూరు – క్రిష్ణగిరి హైవే వెళ్తున్న గ్రానైట్ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. జాతీయ రహదారి కావడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈఘ‌ట‌న‌లో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. క్షతగాత్రులను హోసూరు, క్రిష్ణగిరి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఏడు మంది పరిస్థితి విషమంగా ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. మరో 10 కి పైగా వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. బెంగళూరు – క్రిష్ణగిరి హైవే పై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ‌యింది.

 

 

Vikarabad Viral News” ప‌ట్టాలు దాటుతుండ‌గా ఆక‌స్మాత్తుగా వ‌చ్చిన రైలు.. ఆమె ఎలా త‌ప్పించుకుందంటే.. ఇగో వీడియో

Up Rail News” రైల్వే ప‌ట్టాల‌పై గాఢ నిద్ర‌.. త‌ర్వాత ఏమైదంటే.. వీడియో వైర‌ల్

helicopter crashed” గాల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో

Cloudburst” తెల్లారేస‌రికి గ్రామమే కొట్టుకుపోయింది.. ఒక్క‌టే ఇల్లు మిగిలింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *