Up Rail News” రైల్వే ప‌ట్టాల‌పై గాఢ నిద్ర‌.. త‌ర్వాత ఏమైదంటే.. వీడియో వైర‌ల్

Up Rail News

Up Rail News” ఆక‌లి రుచి ఎరుగ‌దు..నిద్ర చోటేరుగ‌దు అంటారు కానీ.. ఈయ‌న మాత్రం నిద్ర కోసం ఏకంగా ప్రాణాలనే ప‌ణంగా పెట్టాడు. నిద్ర వ‌స్తే ఎవ‌రైనా చెట్టు కిందో.. ఏదైనా నీడ చూసుకుని ప‌డుకుంటారు. కానీ ఈ వ్య‌క్తి మాత్రం ఏకంగా రైల్వే ప‌ట్టాల‌పై గొడుగు పెట్టుకుని గాఢ నిద్ర‌లోకి జారుకున్నాడు. అదే స‌మ‌యంలో ఓ రైలు వేగంగా దూసుకొచ్చింది. దూరం నుంచి ప‌ట్టాల‌పై ఏదో ఉంద‌ని గ‌మ‌నించిన లోకోపైలెట్ రైలును నిలిపివేశాడు. రెండు మూడు సార్లు హారన్ మోగించినా క‌ద‌ల‌క‌పోవ‌డంతో లోకోపైలెట్ కిందికి దిగారు. ద‌గ్గ‌ర వెళ్లి చూస్తే ఓ వ్య‌క్తి చెత్తిరి(గొడుగు) పెట్టుకుని హాయిగా నిద్ర‌పోయాడు. దీంతో లోకోపైలెట్ అత‌న్ని లేపి అక్క‌డి నుంచి పంపించారు. అనంత‌రం రైలును ముందుకు తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

helicopter crashed” గాల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో

Nepal Accident” నదిలో ప‌డ్డ బస్సు 14 మంది మృతి.. నేపాల్‌లో ప్రమాదం..

Variety Marriage Card” ఈ పిలుపు బాగుందండీ… తెలంగాణ భాష‌లో, క‌రీంన‌గ‌ర్ యాస‌లో

Rajastan Viral Video” డ్యాన్స్ చేస్తూ చ‌నిపోయిన టీచ‌ర్‌.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *