Royal Bengal Tiger ” క్రూర మృగాలు ఏవీ అంటే టక్కున సింహం, పులి, ఎలుగుబంటి అని చెబుతాం. సింహం, పులి వేటకు వెళ్తే అన్ని జంతువులు పరార్ కావాల్సిందే. అయితే రాయల్ బెంగాల్ టైగర్ వేటకు బయలుదేరింది. దానికి ఎలుగుబంటి (గుడ్డేలుగు) ఎదురుపడింది. వెంటనే రాయల్ బెంగాల్ టైగర్ దానిపై దూకింది. గుడ్డేలుగు మెడను కరిచి వేటాడబోయింది. కానీ ఎలుగుబంటి( గుడ్డేలుగు) అంతే వేగంగా ఎదురు తిరిగింది. దానిపై దెబ్బకు దెబ్బ అన్న స్థాయిలో దాడికి దిగింది. దీంతో బిత్తరపోయిన రాయల్ బెంగాల్ టైగర్ పరుగు లంకించుకించుంది. రాయల్ టైగర్ పరుగో పరుగు అంటూ పరుగెత్తగా వెనకాలే ఎలుగుబంటి గర్జిస్తూ బెదరకొట్టింది. ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. అడవిలో తిరుగులేదనుకునే సింహం, పులులకు అప్పుడప్పుడు ఇలాంటి షాక్‌లు తగులుతూనే ఉంటాయి.. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూన్నారు. పులి భయపెట్టిన ఎలుగుబంటి అని కొందరు, రాయల్ టైగర్ పారిపోవడం ఆశ్చర్యకరమని మరింకొందరు కామెంట్ పెడుతున్నారు.
Bengal Tiger vs Sloth Bear pic.twitter.com/nzVD14pOSB
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 30, 2024
ఇవి కూడా చదవండి
Hyderbad crime news” మెరుపు వేగంతో ఢీ .. గాల్లో ఎగిరిపడ్డ యువతి వీడియో
Nagar Kurnool” వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.. వీడియో
Nalgonda crime news” సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిన మహిళ.. వీడియో