bathukamma” రంగురంగుల బతుకమ్మ ఉయ్యాలో.. బ‌తుక‌మ్మ పాట‌ను ర‌చించిన రాజేశ్

bathukamma

 bathukamma” బతుకమ్మ పండుగ
తెలంగాణ పూల పండుగ  

మెరిసేటి తాంబాలంలో ఉయ్యాలో
గుమ్మడాకులు పరిచాను ఉయ్యాలో !
తీరొక్క పువ్వు ఉయ్యాలో
దారంతో అల్లిన ఉయ్యాలో !
రకరకాల రంగుల్లో ఉయ్యాలో
పూలన్ని ముంచిన ఉయ్యాలో !
తంగేడు పూలతో ఉయ్యాలో
తల్లులంత ఒక్క చోట ఉయ్యాలో !
ఇరుగు పొరుగు కలిసే ఉయ్యాలో
బతుకమ్మ ను పేర్చెను ఉయ్యాలో !
రంగురంగుల బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !
వెలిసిన కుసుమం ఉయ్యాలో
నిలువెత్తు నిదర్శనం ఉయ్యాలో!
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తోబుట్టువు నీవంట ఉయ్యాలో !
పూజగది లో బతుకమ్మ ఉయ్యాలో
మా పూజలందుకో ఉయ్యాలో !
సత్తులన్ని మూటకట్టి ఉయ్యాలో
బతుకమ్మను ఎత్తుకొని ఉయ్యాలో !
ఆడపడుచులు ఆనందంగా ఉయ్యాలో
బతుకమ్మ తో బయల్దేరెను ఉయ్యాలో !
ఊరు వాడ అంతా ఉయ్యాలో
ఊయలూగును గౌరమ్మ ఉయ్యాలో !
ఈ యాల ఈ పొద్దు ఉయ్యాలో
గుడి ముందు అందరూ ఉయ్యాలో !
ఒక్కేసి పువ్వేసి ఉయ్యాలో
అక్కాచెల్లెళ్ళ ఆట ఉయ్యాలో !
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !
కన్నుల పండుగ ఉయ్యాలో
పువ్వుల పండుగ ఉయ్యాలో !
పల్లె పట్నమంత ఉయ్యాలో
ఆనందం పంచెను ఉయ్యాలో !
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో
సంతోషాలు తెచ్చెను ఉయ్యాలో !
గంగమ్మ ఒళ్ళో ఉయ్యాలో
గంధం పూసేను ఉయ్యాలో !
వెళ్ళిరా బతుకమ్మ ఉయ్యాలో
మళ్ళీ రా బతుకమ్మ ఉయ్యాలో !
మూటలోని సత్తులు ఉయ్యాలో
పలహారాలు పంచెను ఉయ్యాలో !
ఆనంద ప్రతి ఇంట ఉయ్యాలో
అందరి సంతోషం నీవంట ఉయ్యాలో !

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
రాజేశ్ ఖన్నా ✍️

 

ఇవి కూడా చ‌ద‌వండి

 

Vijayawada”నీ వెంటే నేను.. ప్ర‌మాదంలో భ‌ర్త మృతి.. త‌ట్టుకోలేక భార్య ఆత్మ‌హ‌త్య

Chain Snatchers” సెక‌న్ల వ్య‌వ‌ధిలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు… సీసీవీడియో

Pig Viral Video” ప‌గ‌వ‌ట్టిన పంది.. మ‌నిషిని వేటాడి.. వీడియో వైర‌ల్‌

Iron Box” ఫిలీప్స్‌ స్టీమ్ ఐర‌న్ బాక్స్‌ కేవ‌లం రూ. 1,199కే.. 33 శాతం త‌గ్గింపుతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *