Power Plant In Rajasthan” రాజస్థాన్‌లో ఘోర ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ పవర్ ప్లాంట్ సమీపంలో సీఐఎస్ ఎఫ్ CISF వాహనాన్ని సరుకు రవాణా రైలు ఢీకొట్టింది. సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లోని సూపర్-క్రిటికల్ యూనిట్ ప్రాంతంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి చెందిన బొలెరో వాహనం గూడ్స్ రైలు ఇంజిన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఐఎస్ ఎఫ్ CISF సిబ్బంది బొలెరో వాహనం రైల్వే ట్రాక్ దాటుతున్నది. ఈ క్రమంలో పూర్తిగా ట్రాక్ దాటకముందే సరుకు రవాణా రైలు దగ్గరికొచ్చింది. గమనించిన ఒకరు వాహనం నుండి బయటకు వెళ్లారు. మరికొందరు లోపల చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బొగ్గుతో నిండిన సరుకు రవాణా రైలు థర్మల్ ప్రాజెక్ట్‌లోకి ప్రవేశిస్తుండగా అదే సమయంలో సీఐఎస్ఎఫ్ (CISF) బొలెరో వాహనం రైల్వే ట్రాక్ దాటుతున్నది. అయితే అక్కడ రైలు గేట్ లేదు. సరుకు రవాణా రైలు బొలెర వాహనాన్ని ఢీ కొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది.
బొలెరోలో ఒక సిఐఎస్ఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్, జవాన్లు మరియు డ్రైవర్ ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ, ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. రైల్వే పట్టాలపై ఇరుక్కుపోయిన బొలెరోను తరువాత హైడ్రాలిక్ క్రేన్ ఉపయోగించి పట్టాలను క్లియర్ చేసి తొలగించారు. ప్రమాదం జరిగినప్పుడు సిఐఎస్ఎఫ్ అధికారులు మరియు సిబ్బంది సాధారణ గస్తీలో ఉన్నారని సమాచారం.
CISF जवानों की बोलेरो गाड़ी रेल पटरी क्रॉस कर रही थी। तभी मालगाड़ी आ गई। एक जवान उतर गया, तीन बैठे रहे। मालगाड़ी, बोलेरो को घसीटते हुए ले गई।
गनीमत रही कि चोट किसी को नहीं आई। इमरजेंसी ब्रेक लगा दिए गए। ये हादसा राजस्थान के सूरतगढ़ थर्मल पॉवर प्लांट क्षेत्र में हुआ। pic.twitter.com/IIWAUTJDzE
— Sachin Gupta (@SachinGuptaUP) March 23, 2025
ఇవి కూడా చదవండివైరల్ వీడియో, యాక్సిడెంట్, రాజస్థాన్, పవర్ ప్లాంట్, సీఐఎస్ఎఫ్
Cinema news” టాలీవుడ్‌పై అవికాగోర్ ఆశలు…
RedMi” రెడ్ మీబొనంజా ఆఫర్… తక్కువ ధరల్లోనే స్మార్ట్ ఫోన్స్
Peddapalli” 436 రూపాయల ప్రీమియం తో 2 లక్షల బీమా: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..
