Karimnagar ” శంకరపట్నం జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా కోరెం శ్రీనివాసరెడ్డి…
మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి….
శంకరప
ట్నం డిసీ ప్రతినిధి
జర్నలిస్ట్ యూనియన్ మండల శాఖ అధ్యక్షునిగా కోరెం శ్రీనివాసరెడ్డిని
ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కరీంనగర్ జిల్లా టియుడబ్ల్యూ జే మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరిమి వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వెంకటస్వామి కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం, జర్నలిస్టు యూనియన్ మండల పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం మండల యూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. అధ్యక్షునిగా కొరెం శ్రీనివాసరెడ్డి, గౌరవ అధ్యక్షులుగా గోపు శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా తాళ్లపల్లి సాగర్,నేరెళ్ల సంతోష్,పల్లె కోరెం శ్రీనివాసరెడ్డి
సరూప,ప్రధాన కార్యదర్శిగా బూర్ల వెంకటేష్, సంయుక్త కార్యదర్శిగా కత్తెరమళ్ళ కిరణ్,ఆర్గనైజింగ్ సెక్రటరీగా చింతం వెంకటేష్.అధికార ప్రతినిధిలుగా బక్కి ప్రణుదీప్, గరిగే రంజిత్, ప్రచార కార్యదర్శిగా తుమ్మ సుధాకర్, కోశాధికారిగా గొర్ల అనిల్, కార్యవర్గ సభ్యులుగా దేవునూరి రాకేష్,ఎలుకపల్లి సుధీర్,కాటం సంపత్ రెడ్డి,బక్కి అనిత్,పెద్ది గట్టయ్య,తాళ్ల సురేష్ లనుఏకగ్రీవంగా సభ్యులందరూ ఎన్నుకున్నట్లు వెంకటస్వామి తెలిపారు.
//////////////////////////////////////////////////////////////////////
లక్ష మోదుగు పువ్వులతో శివునికి ప్రత్యేక పూజలు…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
శివునికి పూజలు చేస్తే కోటి దేవతలకు పూజలు, మొక్కలు చెల్లించుకున్నట్లే అని, హిందువుల విశ్వాస నమ్మకం. సోమవారం శివునికి ప్రత్యేక రోజు అయిన సందర్భంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జి
ల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఈశాన్య భాగంలో గల పురాతనమైన శివాలయం లో శివునికి మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షలు చేపట్టి లక్ష మోదుగు పువ్వులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మొక్కులుచెల్లించారు. శివుని అనుగ్రహంతో రాష్ట్రవ్యాప్తంగా పాడిపంట అభివృద్ధి చెంది ప్రజలందరూ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండేలా ఆ శివుడు అనుగ్రహించాలని కోరినట్లు ఆలయ ప్రధాన అర్చకులు బంగి మఠం శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
/////////////////////////////////////////////////////////////////////
లింగాపూర్ లో దొంగల బీభత్సం.. తాళం వేసిన ఇండ్లే టార్గెట్..
శంకరపట్నం డిసీ ప్రతినిధి
లింగాపూర్ గ్రామంలో దొంగల బీభత్సం
సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్గా 6 ఇండ్లలో చోరికి పాల్పడట్టు తెలుస్తున్నది. గ్రామంలోని పలు కుటుంబాల వారు తీర్థ యాత్రలకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఆదివారం రాత్రి చోరికి పాల్పడ్డారు. ఆయా ఇండ్లల్లో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని బాధితులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న హుజూరాబాద్ సీఐ వెంకట్, కేశవపట్నం ఎస్సై కొత్తపల్లి రవి గ్రామానికి చేరుకుని ఇండ్లను పరిశీలించారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. లింగాపూర్ గ్రామాన్ని హుజురాబాద్ ఏసీపి శ్రీనివాస్ జి పరిశీలించారు.
1. కవ్వ మన్నెమ్మ ఐదు తులాల పావు బంగారం, 13 గ్రాముల వెండి,
2. దేవుడి రాజయ్య బైకు 20000/
3. కవ్వ బుచ్చమ్మ 4000 క్యాష్
వన్ గ్రామ్ గోల్డ్ (పుస్తెలు)
4. నాగండ్ల శ్రీలత 12 గ్రాముల బంగారం
20 తులాల వెండి
5. చింత సరిత పదివేల నగదు ,40 తులాల వెండి పోయినట్టు సమాచారం…
///////////////////////////////////////////////////////////////////////////
పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు.
నియోజకవర్గంలో 2627 ఎకరాల్లో పంట నష్టం.
ఈనెల 21న కురిసిన అకాల రాళ్ళ వర్షం, వడగండ్ల వాన పెద్దపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రైతులు పంట నష్టపోయారని, వారికి తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని, అందుకు నిధులు విడుదల చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైదారాబాద్ లో అసెంబ్లీ హాల్లో సీఎం ఛాంబర్ లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే విజయ రమణారావు కలిసి పంట నష్టం, రైతులకు పరిహారం చెల్లింపుపై వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని 2 మండలాల్లోని 11 గ్రామాల్లో 1035 మంది రైతులకు చెందిన వరిపంట దెబ్బతిందని, 6 మండలాల్లోని 28 గ్రామాల్లో 828 మంది రైతులకు చెందిన 1084 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు వర్షం వల్ల నష్టం వాటిల్లిందని సీఎంకు తెలిపారు. అలాగే ఒక మండలంలోని గ్రామంలో 30 మంది రైతులకు సంబంధించి 20 ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వ్యవసాయ అధికారులతో పంటనష్టం సర్వే చేయించి ప్రాథమిక అంచనా రూపొందించామని పేర్కొన్నారు. తాను స్వయంగా పెద్దపల్లి నియోజక వర్గంలోని పంటపొలాలు, మొక్కజొన్న చేన్లు, కూరగాయల తోటలను పరిశీలించి పంట నష్టంపై అధికారులతో సమీక్షించానని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 1896 మంది రైతులకు చెందిన 2627 ఎకరాల్లో పంటలు నష్టపోయారని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పంటనష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. ఇందుకు గాను దెబ్బతిన్న పంటలకు రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. అవసరమైన మేరకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి రైతులను ఆదుకుంటామని అభయమిచ్చారని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. నష్టపరిహారం తక్షణమే అందేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు తొందరలోనే పరిహారం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు.
/////////////////////////////////////////////////////////////////////////////////////
చలివేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
కరీంనగర్ :
కరీంనగర్ రెవెన్యూ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్
మెయిన్ గేట్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ పనుల కోసం, ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించేందుకు కలెక్టరేట్ కు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ మహేశ్వర్, ఉద్యోగుల సంఘం నాయకులు దారం శ్రీనివాస్ రెడ్డి, కాళీ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
