సిపిఐ(ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ శివకుమార్ పార్టీ శ్రేణులతో గురువారం సైకిల్ పై నిజామాబాద్ నగరంలోని NR భవన్ నుంచి మున్సిపాలిటీ వరకు భారీ ర్యాలీ తో వెళ్లి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య లు మాట్లాడారు. ప్రజా సమస్యలను పై పోరాడే వారిని అసెంబ్లీకి పంపాలని నిజామాబాద్ నగర ప్రజలను కోరారు. పేదల ఇళ్ల స్థలాల సమస్యపై, తాగునీటి సమస్యపై, డబుల్ బెడ్ రూమ్ లకై, ఉద్యోగాల భర్తీ, హాస్పిటల్ సమస్యలపై, కార్మికుల ఉపాధి భద్రత కోసం, నగరంలో మహిళ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో రోడ్లు బాగు చేయాలని ఆందోళన చేసిన చరిత్ర పార్టీకి ఉందన్నారు. డబ్బు, మద్యం, ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి మళ్లీ ప్రజల్ని మోసగించే కుట్ర బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం అని మాట ఇచ్చి కెసిఆర్ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య ఐక్యత దెబ్బతీస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని దాసు, భూమయ్య కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ అభ్యర్థి శివకుమార్, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బి సూర్య శివాజీ, పరుచూరి శ్రీధర్, ఎండి కాజా మొయినుద్దీన్, నీలం సాయిబాబా, బి భూమన్న, గౌతమ్, కూమనపల్లి భూమన్న, దేశెట్టి సాయి రెడ్డి, జేల్లా మురళి, వనమాల సత్యం, గంట్యాల రమేష్, జేపీ గంగాధర్, జన్నారపు రాజేశ్వర్, పోశెట్టి, బండమీది నరసయ్య ,అగ్గు ఎర్రన్న,కారల్ మార్క్స్, గోపాల్, అనిత, భారతి, కృష్ణగౌడ్, మోహన్,తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
అమెరికాలో కత్తిపోట్లు.. ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల నాలుగో విడత జాబితా పెండింగ్‌లో 19 స్థానాలు
పువ్వులేవీ..? ప్రియాంక గాంధీ.. బొకే చూసిన నవ్విన వైనం వీడియో వైరల్
కాంగ్రెస్ మూడో లిస్ట్… పాతవారిలో కొందరి మార్పు.. సీఎంపై పోటీ ఎవరంటే