శ్రీహరికోట చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. అదే ఆదిత్య-ఎల్1. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ఈ మిషన్‌ని చేపట్టింది. ఆల్రెడీ దీని కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో శుక్రవారం 12:10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 2వ తేదీన ఉదయం 11:50 నిమిషాలకు ఈ ఆదిత్య-ఎల్1 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఆదిత్య ఎల్1ని లాంచ్ చేసేందుకు మేము రెడీ అవుతున్నాం. రాకెట్, శాటిలైట్ సిద్ధంగా ఉన్నాయి. లాంచ్‌కి రిహార్సల్స్ పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. గతంలో అమెరికా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిపైకి ఉపగ్రహాల్ని పంపగా.. ఇప్పుడు ఆదిత్య ఎల్1తో సూర్యుడిపైకి ఉపగ్రహం పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించబోతోంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి సోలార్ మిషన్ ఇది. కరోనాగ్రఫీ అనే పరికరం సహకారంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించనున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్టేల్రియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహాయంతో ఇస్రో సంస్థ ఈ మిషన్‌ని చేపడుతోంది. ఇందులోని శాటిలైట్ బరువు 1500 కిలోల బరువు ఉంటుంది. ఆదిత్య ఎల్1ను భూమి నుంచి 15 లక్షల కిలోవిూటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లనుంది. అవి.. 1. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, 2. అల్టావైల్రెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, 3. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, 4. ఎక్ష్మి-లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, 5. సోలార్ లో-ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్టోవ్రిూటర్, 6. హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్టోవ్రిూటర్, 7. మాగెటోవిూటర్. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా వీటిని రూపొందించారు. ఈ ఏడు పేలోడ్స్ ఎలక్టోమ్రాగెటిక్, మాగెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సహాయంలో.. సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్ (కాంతిమండలం), క్రోమోస్పియర్ (వర్ణ మండలం), వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. మొత్తం నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే.. మిగతా మూడు పేలోడ్స్ సవిూపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. పీఎల్‌ఎల్‌వీ-సీ57 అనే వాహననౌక ఈ ఆదిత్య-ఎల్1ను మోసుకొని నింగిలోకి దూసుకెళ్లనుంది. 177 రోజుల పాటు ఇది ప్రయాణం చేసి, ఆ కక్ష్యలోకి చేరుకుంటుంది.
చదవండి