Mlas” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవలగా చేరిన మంత్రులు శుక్రవారం ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు.
ఈ సందర్బంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూర్), మందుల సామెల్ (తుంగతుర్తి), తోట లక్ష్మీకాంతరావు (జుక్కల్), కాలె యాదయ్య (చేవెళ్ల) ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయడం పట్ల వారి హర్షం వ్యక్తం చేశారు.
అలాగే, నూతనంగా మంత్రిగా ప్రమాణం చేసిన వాకిటి శ్రీహరి మరియు సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.
