Educational Awareness” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
‘‘ప్రభుత్వ బడులే ముద్దు, ప్రైవేట్ బడులు వద్దు’’ అనే నినాదంతో విద్యపై అవగాహన పెంచేందుకు సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని మొలంగూర్, చింతలపల్లె, కన్నాపూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీరజ, జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం అన్ని వసతులు – ఇంగ్లీష్ మీడియం బోధనలు, స్మార్ట్ తరగతులు, ఉచిత వాహన సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఇది ప్రకటన.. దీని కింద వార్త కొనసాగుతుంది..
Back To School Time!
వీళ్ళకు కావాల్సినవి అన్నీ ఒకేచోట!
Water Bottles, Lunch Boxes, Sandwich Makers & More!
⚡ ధరలు ప్రారంభం రూ.99 నుండి మాత్రమే!
https://amzn.to/4dQo17a లింక్ పై నొక్కండి
తప్పక చూసేయండి – ఈ ఆఫర్లు మిస్ అవ్వకండి!
వారు మాట్లాడుతూ, తల్లిదండ్రులు బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తు బాగుండేలా చేయాలని సూచించారు. కార్పొరేట్ పాఠశాలలపై ఆధారపడకుండా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
