Wednesday , 26 June 2024
Breaking News

ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో పేలుడు

ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఏం ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. ఈ ఘటనతో ఢిల్లీలో ఒక్కసారిగా శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. నగరంలో మొత్తం హై అలర్ట్‌ ప్రకటించి భద్రతా చర్యలను పెంచారు. పోలీసులు ఇన్‌కమింగ్‌ మెయిల్స్‌ వచ్చాయా అని పరిశీలిస్తున్నారు. గతంలో మాదిరిగానే చేశారా లేక ఇంకేమైనా చేయాలనే యోచనతో ఇదంతా చేశారా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టారు.

66 కోట్లతో కార్లు కొని బెజవాడలో దాచారు..

ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం ఆవరణంలోని వెనక భాగంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పేలుడు సంభవించింది. దీనిని ముందుగా సెక్యూరిటీ గార్డు గమనించినట్టు అధికారి ఒకరు తెలిపారు. ఒక చెట్టు దగ్గర పొగలు వచ్చాయని వెల్లడించారు. ఎవరిని ఏం కాలేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న డిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. యూదుల కమ్యూనిటీ కేంద్రాలు, ఇతర ముఖ్యమైన యూదుల సంస్థలకు బెదిరించాలనే ఈ చర్యకు పాల్పడారనే ఆందోళన అధికారుల్లో నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం, అధికారులకు ఇవ్వాల్సిన భద్రతపై సమీక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇన్‌కమింగ్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్‌లను, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల మధ్య సహకార నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ర్యాంప్‌-అప్‌ భద్రతను అన్ని రాయబార కార్యాలయాలకు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, సాంస్కతిక ప్రదేశాలలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. 2012, 2021లో ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం లక్ష్యంగా జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకుని అధికారులకు భద్రతను పెంచారు. జనవరి 29, 2021న బీటింగ్‌ రిట్రీట్‌ వేడుక సమయంలో కూడా ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వెలుపల తక్కువ-తీవ్రతతో పేలుడు సంభవించింది. ఆ సమయంలో భద్రతా అలారం మోగింది. ఎంబసీ సమీపంలో అనుమానాస్పద వ్యక్తులను క్యాబ్‌ డ్రైవర్‌ గుర్తించారు. ఇందులో లడఖ్‌లోని కార్గిల్‌ జిల్లాకు చెందిన నలుగురు యువకుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ప్రియుడిని ఇరికించబోయి దొరికిన యువతి

అదేవిధంగా 2012లో ఇజ్రాయెల్‌ దైత్యవేత్త వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని రక్షణ అటాచ్‌ అధికారి భార్య తాల్‌ యేహౌషువా కోరెన్‌ను గాయపడిచారు. ఆ సమయంలో భద్రతా సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో వారు భయపడి దేశం విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా అదే విధంగా భయపట్టేందుకు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఉంటారనే ధోరణిలో అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ దీన్ని అంత సులువుగా తీసుకున్నట్టు తీసుకోకుండా నిఘాను ఏర్పాటు చేశారు.
సైకో అనాలిసిస్‌ సైట్‌లో వారి ఉనికిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇరాన్‌లో మరణించిన జనరల్‌ ఖాసెమ్‌ సోలేమానీ, అణు శాస్త్రవేత్త మొహసేన్‌ ఫక్రిజాదేలను ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్‌ రాయబారిని ఉద్దేశించి రాసిన అస్పష్టమైన లేఖ పేలుడును కేవలం ట్రైలర్‌గా ట్యాగ్‌ చేసింది.

 

పాకిస్థాన్‌ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ

About Dc Telugu

Check Also

Viral video

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Viral video” ఈ మ‌ధ్య యువ‌త రీల్స్ కోసం ఎంత‌టి సాహసాలకైనా వెనుకాడ‌డం లేదు. మొన్న పూణేలోని ఓ ఎత్త‌యిన …

Video viral

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Video viral” రీల్స్ చేయ‌డం… ఫేమ‌స్ అవ‌డం.. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌.. సాధార‌ణంగా కొన్ని ప‌నులు చేయ‌డానికి కొంత …

tribal women

tribal women” ఆదివాసి మ‌హిళ‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆర్థిక సాయం ప్ర‌కటించిన మంత్రి జూప‌ల్లి

tribal women” నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ‌లం మొలచింత‌లప‌ల్లి ఆదివాసీ మ‌హిళ‌పై దారుణంగా దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com