Auto Union” ఆటో యూనియన్ నాయకుల శ్రమదానం – గుంతల పూడ్చివేతకు ప్రభాకర్ సాయం

Auto Union” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో ఆటో యూనియన్ నాయకులు ఆదివారం నాడు శ్రమదానం నిర్వహించారు. మండల ఆటో యూనియన్ అధ్యక్షులు సుంకరి కిషోర్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, కేశవపట్నం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఉన్న రోడ్డుపై గుంతల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని, వాటిని పూడ్చేందుకు ఆటో యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా శ్రమదానం నిర్వహించారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తణుకు ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఈ సేవా కార్యక్రమానికి కావాల్సిన సిమెంట్, ఇసుక, కంకర వంటి అవసరమైన పదార్థాలను అందించారు. సేవా మనోభావం కలిగిన మానవతావాదిగా ఆయన చూపిన ఉదారత అభినందనీయమని కిషోర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు వెంకటస్వామి, పరమేశ్వర్, శ్రీకాంత్, తిరుపతి, షారుక్ తదితరులు పాల్గొన్నారు.

రాఖీ స్పెషల్ గిఫ్ట్ సెట్ – అన్నయ్యకి ప్రేమతో!
Dreamica Rakhi Combo – Pack of 8
5 అందమైన రాఖీలు
లార్డ్ గణేశుడి విగ్రహం
స్పెషల్ గ్రీటింగ్ కార్డు
రోలీ చావల్ ప్యాక్ తో సంపూర్ణత
✨ కోడ్: GN-28

అన్నయ్యకి మీ ప్రేమను తెలియజేయడానికి ఇదే బెస్ట్ ఛాయిస్!
ప్రేమతో… ఆప్యాయతతో… స్నేహంతో!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/46fDhc9 లింక్ పై క్లిక్‌చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *