Cyber crime news” ఈ మధ్యకాలంలో సైబర్ క్రైం మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రూపాయి పెట్టండి వందల రూపాయలు గెలుచుకోండి అంటూ కేటుగాళ్లు అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. రోజుకు వేల రూపాయలు సంపాదించండి అంటూ మోసపూరిత ప్రకటనలతో అమాయకులకు వల విసురుతూ లక్షల రూపాయలు మాయం చేస్తున్నారు. రోజు ఎక్కడో ఏ చోట మోసం జరుగుతూనే ఉంది. పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా అమాయకులు అత్యాశకు మోసపోతూనే ఉన్నారు. ఇటువంటి వాటిపై తెలంగాణ పోలీసులు అవగాహన కల్పించేందుకు ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఓ వ్యక్తి అట్టపెట్టలో దాక్కుని ఉండగా మరి కొంత మంది తమ వస్తువులను అందులో వేస్తారు. అందులో దాక్కున్న వ్యక్తి ఒకటి రెండు ఇస్తూ వాళ్లను సర్‌ప్రైజ్ కు గురి చేస్తాడు. కానీ చివరి వ్యక్తి తాను వేసుకున్న బట్టలతో సహా ఆ డబ్బాలో వేసి మోసపోతాడు.. ఈ వీడియోను తెలంగాణ పోలీసులు పోస్టు చేస్తూఈ క్యాప్షన్ రాసుకొచ్చారు. సైబర్ నేరగాళ్లు ఎక్కడైనా, ఎప్పుడైనా మోసం చేస్తారని పేర్కొన్నారు.
ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషి అత్యాశను ఆసరాగా చేసుకొని మోసం జరుగుతుంది. సైబర్ నేరగాళ్లు సైతం ఇలాగే ఒకటికి రెండు రెట్లు సంపాదించొచ్చని ఆశపెట్టి మీతో కొంత డబ్బుతో పెట్టుబడులు పెట్టిస్తారు. ఆ తర్వాత మీ నుంచి సర్వం దోచేసి మొహం చాటేస్తారు.#TelanganaPolice #CyberCrimeAwareness pic.twitter.com/ugKuVwAioz
— Telangana Police (@TelanganaCOPs) July 27, 2024
ఇవి కూడా చదవండి
atal setu”15 సెకన్లలోనే ఆత్మహత్య .. సీసీవీడియో
Khammam News” ఖమ్మంలో ఘోరం..తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. 9 ఏండ్ల బాలిక మృతి
Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది
atal setu”15 సెకన్లలోనే ఆత్మహత్య .. సీసీవీడియో
Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన తమ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.