Molangur” సామాజిక సేవాకర్త రఘుపతి మృతి…

Molangur”  మొలంగూర్ లో విషాదం…
శంకరపట్నం :డిసీ ప్రతినిధి:
సామాజిక సేవాకర్త, దైవ భక్తిపరుడు తుమ్మ రఘుపతి శుక్రవారం మృతి చెందాడు , రఘుపతి మృతితో మొలంగూర్ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన తుమ్మ రఘుపతి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకు ఉన్నదాంట్లో తోచినంత, సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఖర్చు చేస్తూ, తన ఆత్మీయులకు అండగా ఉంటూ, గ్రామంలోని పోచమ్మ దేవాలయానికి వెండి కిరీటం, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయానికి విరాళాలు అందజేసి దైవ కార్యక్రమాల్లో తుమ్మ రఘుపతి తన ఆధ్యాత్మికతను చాటుకునేవారని రఘుపతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. రఘుపతి మృతి పట్ల గ్రామ తాజా మాజీ సర్పంచ్ మోరె అనూష శ్రీనివాస్, రాయిని శంకరయ్య, దండు సాయిలు నరహరి శారద బుచ్చిరెడ్డి, మరాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ వావిలాల రాజు, బిజెపి పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య తోపాటు గ్రామస్తులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

 

 

Hisense” హైసెన్స్ 43E6N స్మార్ట్ 4K గూగుల్ టీవీ – బడ్జెట్‌లో హైఎండ్ ఫీచర్లు!

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *