Bjp Submission” అక్రమంగా ప్రభుత్వ గోదాం వాడకం… శాఖ పరంగా చర్యలు తీసుకోవాలి…

Bjp Submission”  బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ వినతి పత్రం అందజేత…
సానుకూలంగా స్పందించిన త‌హ‌సిల్దార్ సురేఖ..
శంకరపట్నం డిసీ ప్రతినిధి..
అక్రమంగా ప్రభుత్వ గోదామును వాడుకొని ఆర్థికంగా లక్షల రూపాయలు ప్రభుత్వానికి గండి పెడుతున్నారని బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆరోపించారు. బుధవారం కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం,కేశవపట్నం గ్రామంలో గల ప్రభుత్వ గోదామును ఆక్రమంగా ఎలాంటి కిరాయిలు చెల్లించకుండ వాడుకుంటున్నారని బిజెపి పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో త‌హ‌సిల్దార్ కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఏనుగుల అనిల్ మాట్లాడారు.

కేశవపట్నం గ్రామం పంచాయతీ పరిధిలోని పాపయ్య పల్లె రోడ్డులో ప్రభుత్వ ఈజీఎస్ నిధులతో నిర్మాణం చేసిన గోదామును కొన్ని ఏళ్ల నుండి గణేష్ రైస్ మిల్లు యజమానులు అక్రమంగా, ప్రభుత్వానికి ఎలాంటి అద్దె, కిరాయిలు చెల్లించకుండ అక్రమంగా వాడుకుంటున్నారని చెప్పారు.

ఈ మేర‌కు త‌హ‌సిల్దార్ సురేఖకు ఓ వినతి పత్రాన్ని అందజేసినట్టు చెప్పారు. త‌హ‌సిల్దార్ సురేఖ సానుకూలంగా స్పందించి శాఖ పరంగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అనిల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కనుకం సాగర్, ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య, నాయకులు, కొయ్యడ కుమార్ యాదవ్, పలకల రాజిరెడ్డి, జంగ జైపాల్, రాస మల్ల శ్రీనివాస్, దాసరి సంపత్, చేర్ల శ్రీనివాస్, తోపాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీరు ఇంకా దోమలతో బాధపడుతున్నారా?
LifeKrafts Magnetic Mosquito Net తో తుమ్మెదలకు గుడ్‌బై చెప్పండి!
ఆటో క్లోజింగ్ మాగ్నెట్, సులభమైన ఇన్‌స్టాలేషన్
️ గాలి ప్రవాహం – దోమల రాకకు చెక్!
స్టైలిష్ & సురక్షితమైన డోర్ మెష్!

అమెజాన్లో కొనుగోలు కోసం  https://amzn.to/44w3z8K లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *