Electric Poles” రోడ్డులో మ‌ధ్య‌లోనే విద్యుత్ స్తంభాలు! వీడియో

Electric Poles”   శిమ్లా/సిర్మౌర్, జూలై 16:
హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల నిర్మితమైన రోడ్డుపై విద్యుత్ స్తంభాలు నేరుగా మ‌ధ్య‌లో నిలబడి ఉండటంతో, అది ఓ ‘డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్’ లా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఈ రోడ్డు సిర్మౌర్ జిల్లా బద్రిపూర్, కిషన్‌పురా, సంతోఖ్‌గఢ్, పురువాలా గ్రామాలను కలుపుతోంది.


రోడ్డు వేశారు.. కానీ విద్యుత్ లైన్ మర్చిపోయారు!

మాజీ విద్యుత్ శాఖ మంత్రి మరియు బీజేపీ ఎమ్మెల్యే సుఖరాం చౌదరి  మాట్లాడుతూ.. ఇవి విద్యుత్ లైన్ దాదాపు 25 ఏళ్ల పాతది. అప్పట్లో ఈ స్తంభాలు రోడ్డుకు బయట ఉండేవి. కానీ, కొత్తగా రోడ్డును విస్తరించేటప్పుడు ఆ విద్యుత్ లైన్‌ను తొలగించాలన్న అంశాన్ని ఎవరూ పరిగణలోకి తీసుకోలేదు.

“నేను సంబంధిత శాఖను సంప్రదించాను. కానీ వారికి నిధులు లేవని చెబుతున్నారు,” అని చౌదరి తెలిపారు.


బిహార్ తరహా .. 

ఇదే తరహా ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. పట్నా-గయా రహదారిపై చెట్లు తొలగించలేకపోయిన అధికారులు, చెట్ల చుట్టూ రోడ్డు వేశారు. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో వైర‌ల్ గా మారింది.  ఇప్పుడు అదే విధంగా హిమాచల్‌లో విద్యుత్ స్తంభాలు మద్యలో  ఉన్నాయి..

 

️ Clean Brite గార్బేజ్ బ్యాగ్స్ – ఇంటికో శుభ్రత గిఫ్ట్!
బ్లాక్ కలర్, 19×21 ఇంచెస్, HLDP హెవీ ప్లాస్టిక్
డ్రై & వెట్ వేస్ట్‌కు పరిపూర్ణం
✅ 60 బ్యాగ్స్ (30 × 2 రోల్స్)
1 మిలియన్+ హోమ్స్ ట్రస్ట్ చేస్తున్న బ్రాండ్!
అద్భుతమైన డీల్ – కేవలం ₹189 కి (₹1.05/బ్యాగ్)
#SwachhHome #SmartChoice #CleanBrite

అమెజాన్లో కొనుగోలు కోసం లింక్‌పై క్లిక్ చేయండి.. https://amzn.to/44wRbVZ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *