Molangur” మొలంగూర్ పంచాయతీ కార్యదర్శిపై సమగ్ర విచారణ చేయాలి:  తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గణేష్… జిల్లా అధ్యక్షుడు గణేష్

Molangur”   శంకరపట్నం, సెప్టెంబర్ 2 (డిసి ప్రతినిధి):
మొలంగూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌పై క్షేత్రస్థాయి సమగ్ర విచారణ చేపట్టి, శాఖపరంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన సమితి (తజస) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మోరె గణేష్ అధిక అధికారులను కోరారు.

మంగళవారం మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఎంపీ ఓ కాసగోని ప్రభాకర్‌లకు ఓ వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, “గ్రామంలో ఇష్టానుసారంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆన్లైన్‌లో ఇంటి నిర్మాణ అనుమతులు పొందకుండా నిర్మాణాలు చేపడుతూ, వాటి యజమానుల నుండి కరెంట్ మీటర్ పేరిట పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వసూళ్లు చేస్తున్నారు. అంతేగాక, మొలంగూర్ శివారులో జాతీయ రహదారి సమీపంలో ఇండస్ట్రియల్ అనుమతులు లేకుండా సిమెంటు బ్రిక్స్ పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారి నుండి కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని” ఆరోపించారు.

తాజాగా తజస ఆధ్వర్యంలో మొలంగూర్ గ్రామంలో చేపట్టిన ప్రజా సమస్యల సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని గణేష్ తెలిపారు. “పంచాయతీ కార్యదర్శి తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ, ప్రజలతో నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. గ్రామానికి అవసరమైన పనుల కోసం వచ్చిన వారితో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. కుర్చీ ఎత్తి బెదిరించిన ఘటన కూడా మా సర్వేలో వెల్లడైంది” అని చెప్పారు.

గణేష్, ఈ అంశాలపై అధికారులను అప్రమత్తం చేస్తూ పంచాయతీ కార్యదర్శిపై శాఖపరంగా విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విషయమై స్పందించిన ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఎంపీ ఓ ప్రభాకర్‌లు, “విషయం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకొని శాఖపరంగా సమగ్ర విచారణ జరిపి, పంచాయతీ కార్యదర్శిపై తగిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం” అని హామీ ఇచ్చినట్లు గణేష్ తెలిపారు.

Laptop Review” ల్యాప్‌టాప్ లు కొనాల‌నుకుంటున్నారా…? ఇది చూడండి ఒక సారి లింక్ పై క్లిక్ చేయండి. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *