Cinema”గాయ‌ప‌డ్డ న‌టి.. ముఖంపై 13 కుట్లు

Cinema” ఈ మధ్య సినీ ప్రముఖులు షూటింగ్స్‌లో ఎక్కువగా గాయపడటం సంబంధించిన వార్తలు వింటూ వస్తున్నాం. రిస్కీ స్టంట్స్‌ చేస్తూ లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా ఓ హీరోయిన్‌కి యాక్సిడెంట్‌ జరగగా, ఆమెని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె నుదుటిన 13 కుట్లు వేసి చికిత్స చేశారు. ఇంతకి ఆ హీరోయిన్‌ మరెవరో కాదు భాగ్య శ్రీ. సల్మాన్‌ ఖాన్‌తో కలిసి మైనే ప్యార్‌ కియా అంటూ ఇండ‌స్ట్రీలో సంచలనం సృష్టించన ఈ అందాల చిన్నది మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టేసింది. వ్యాపారవేత్త వ్యాపారవేత్త హిమాలరు దస్సానిని పెళ్లి చేసుకుని సినిమాలకు శాశ్వతంగా దూరమైంది. ఈ మధ్య పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన రాధే శ్యామ్‌ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. రీఎంట్రీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడడంతో భాగ్య శ్రీ అభిమానులు అప్సెట్‌ అయ్యారు. అయితే భాగ్య‌ శ్రీ సినిమా షూటింగ్‌లో కాకుండా గేమ్‌ ఆడుతూ.. గాయపడడం చర్చనీయాంశం అయింది. దాదాపు సినిమా స్టార్స్‌ అందరు సెట్స్‌లోనే ఎక్కువ గాయపడుతుంటారు. కాని భాగ్య శ్రీ పికిల్‌ బాల్‌ ఆడుతుండగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు, తలకి బ్యాండేజ్‌తో ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 13 కుట్లు ఆమెకి పడగా, ఫొటోలలో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. భాగ్యశ్రీ 1989 లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆమె నటించిన మొదటి సినిమా ‘మైనే ప్యార్‌ కియా’ కాగా, ఇందులో సల్మాన్‌ ఖాన్‌ తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. మొదటి సినిమానే సూపర్‌ హిట్‌ కావడంతో భాగ్యశ్రీకి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు బెంగాలీ, కన్నడ, భోజ్‌పురి, మరాఠీ వంటి భాషల్లోనూ మెరిసిందీ. చివరిగా లైఫ్‌ హిల్‌ గయూ అనే వెబ్‌ సిరీస్‌లో కనిపించింది. 2023లో నాలుగు సినిమాల్లో నటించిన భాగ్యశ్రీ ఆ తర్వాత కొత్తగా సినిమాలకు గ్రీన్‌ సిగల్‌ ఇవ్వలేదు. 60కి చేరువ అవుతున్నా ఆమె గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదు.భాగ్య శ్రీ ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం ఏమి లేదని ఈ రోజు లేదా రేపు ఆమెని డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

 

Cinema News:ప‌ర‌దా లో ఓస‌ర్‌ప్రైజ్ హీరోయిన్ గెస్ట్ రోల్‌

Mankondur”మృతుడి భార్యకు గాయత్రి బ్యాంక్ చెక్కు అందజేత..

Integrated BED” ఇంట‌ర్ త‌ర్వాత.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోసం ఎలా అప్ల‌య్ చేయాలంటే..?

Petrol” ఆ వాహ‌నాల‌కు పెట్రోల్ బంద్ .. వాటిని గుర్తించేందుకు గ్యాడ్జెట్లు

10Th Hall tickets”పదో త‌ర‌గతి హాల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి.. ఎలా డౌన్లోడ్ చేయాలంటే.. హాల్ టిక్కెట్ పొందండి..

Constable Jobs” ప‌దోత‌ర‌గ‌తితో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు..

GAIL Recruitment” గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో (GAIL) 73 పోస్టుల రిక్రూట్‌మెంట్ పోస్టు పేరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

Government Jobs” హైద‌రాబాద్‌లోని ఐఐసీటీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్‌.. ఇంట‌ర్ అర్హ‌త పోస్టులు 15

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *