రెండేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా భయపెట్టింది. అల్ఫా, డెల్టా అంటు పలు వేరియంట్లుగా వ్యాప్తి చెందింది. ఆ సమయంలో ఏ ఆస్పత్రిలో చూసినా కరోనాతో బాధపడుతున్న వారే దర్శనమిచ్చారు. కరోనా అన్ని రంగాలను కుదేలు చేసింది. ఎన్నో కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఎంతో ఆస్తినష్టం వాటిల్లింది. కరోనా తగ్గిందని అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసులు పెరుగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా కరోనా కేసులు నమోదు అయితే జేఎన్1 కావచ్చని ప్రజలు భయపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం భయం లేదు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెప్తుంది. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు సైతం జారీచేసింది. కానీ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీచేసింది.
ఆరునెలల చిన్నారికి కరోనా..
తాజాగా బీహర్‌కు చెందిన ఓ ఆరునెలల చిన్నారితో పాటు మరో ముగ్గురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో వైద్యులు, ప్రజలు కరోనా జేఎన్ 1 కావచ్చని ఆందోళన చెందుతున్నారు. ఈ చిన్నారిని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోలకత్త మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స చేస్తున్నారు. మిగతా వారికి వేర్వేరు ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే వారికి కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 వచ్చిందా లేదా అని తెలియాల్సి ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా నిర్దారించాల్సి ఉంటుంది. వైద్యులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వీరికి ఇన్‌ఫ్లుఎంజా అనారోగ్యం సంబంధించి అంటే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కదులుతున్న రైలు ఎక్కొద్దు అంటే వినరు.. చూడండి ఏం జరిగిందో..
శభాష్ కానిస్టేబుల్.. తలుపులు పగులగొట్టి కుటుంబాన్నికాపాడిన పోలీస్..