Karimpeta” శంకరపట్నం డిసి ప్రతినిధి:
ప్రజా ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలానికి చెందిన కరీంపేట గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై, కాలనీల పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించామని వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ గొట్టే శ్రావణ్ కుమార్, ఎంపీ ఓ కాసగొని ప్రభాకర్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
