Helicopter Crash” హెలికాప్ట‌ర్ కూలి ముగ్గురు మృతి

Helicopter Crash

Helicopter Crash” హెలికాప్ట‌ర్ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న పూణేలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఆక్స్‌ఫర్డ్ గోల్ఫ్ క్లబ్‌లోని హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ బుధ‌వారం బయలుదేరింది. ఈ క్ర‌మంలో ఉద‌యం 6. 45 నిమిషాల‌కు బావధాన్ బుద్రుక్ ప్రాంతంలో ప్ర‌మాద‌వ‌శాత్తూ కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు వ్య‌క్తులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చని ప్రాథమిక అంచ‌నా. సుమారు ఉదయం 6:45 గంటలకు హింగేవాడి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు క్రాష్ అయిన‌ట్టు సమాచారం అందింది. దీంతో రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించేందుకు లోక‌ల్ పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌తో సహా అత్యవసర సేవలు అందించే వారు అక్క‌డి వెళ్లారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రెన్నో ఇంట్ర‌స్టింగ్ క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Wine Shop” మ‌ద్యం షాపుల‌కు 9 తారీఖు నుంచి ద‌ర‌ఖాస్తులు

Thailand” అయ్యో పాపం.. స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థుల మృతి..

Smart Watch” త‌క్కువ‌ ధ‌ర‌లో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా…? ఇది ట్ర‌యి చేయండి.. రూ.1599కే

Mixer Grinder” ప్రెస్టీజ్ మిక్స‌ర్ గ్రైండ‌ర్ల‌పై 59 శాతం త‌గ్గింపు… ఇదే మంచి తరుణం.ఇదే మంచి తరుణం. ఇదే మంచి తరుణం..

Washing Machines” వాషింగ్ మెషిన్ల‌పై భారీ త‌గ్గింపు… త్వ‌ర‌ప‌డండి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్ట‌వెల్ ఆఫ‌ర్ల‌లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *