దిగొచ్చిన ట‌మాట‌

దిగొచ్చిన ట‌మాట‌
కిలో 30 రూపాయలే మదనపల్లె
కొన్నినెల‌ల‌గు ఆకాశాంటున్న‌తున్న ట‌మాటా ఇప్పుడిప్పుడే దిగి వ‌స్తోంద‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కిలో 200 పైమాటే ఉన్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా చిత్తూరు జిల్లా మద‌నపల్లి మార్కెట్‌ లో కిలో టమాటా అత్యధికంగా 36 రూపాయలు పలికింది. ఇప్ప‌టి వరకు ఇదే మార్కెట్‌ లో కిలో 250 రూపాయలు పలికింది. ఇప్పుడు కేజీ 36 రూపాయలు మాత్రమే విక్ర‌యిస్తున్నారు. రైతులకు. పంట దిగుబడి భారీగా పెరగటం.. మార్కెట్‌ కు పంట ఎక్కువగా రావటంతో ధర పడిపోయిందని చెబుతున్నారు. రైతులు, వ్యాపారులు. మధనపల్లి హోల్‌ సేల్‌ మార్కెట్‌ లోనే ధర పడిపోవటంతో.. రిటైల్‌ మార్కెట్‌.. ముఖ్యంగా రైతు బజార్లలోనూ ధర తగ్గింది. హైదరాబాద్‌ రైతు బజార్లో కిలో టమాటా 50 రూపాయలకు తగ్గింది. ఇక సూపర్‌ మార్కెట్లలో 60 రూపాయలుగానే ఉంది. రాబోయే వారం రోజుల్లో కిలో టమాటా 30 రూపాయలకు పడిపోనున్నట్లు అంచనా వేస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *