Ganesh Festival” శంకరపట్నంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్య..

Ganesh Festival”
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు..
అర్థరాత్రి వరకు ప్రతిష్టాపనరు..
శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం బొజ్జ గణపయ్య కు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన కార్యక్రమం చేసినట్లు పూజారులు తెలిపారు. ఈ సందర్భంగా పూజారులు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో గణేష్ యువజన భక్తమండలి, దేవాలయాల్లో, గణేష్ నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని బొజ్జ గణపయ్య విగ్రహాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నెలకొల్పారని, బొజ్జ గణపయ్య ప్రతిష్టాపన కోసం ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి అలంకరణలు చేసి తొమ్మిది రోజులపాటు బొజ్జ గణపయ్యకు పూజలు నిర్వహించి ఆయా గ్రామాల్లోని చెరువులో కుంటలలో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాల నాయకులు, గణేష్ యువజన మండలి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *