Govt health services” ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి: జిల్లా వైద్యాధికారి వెంకటరమణ

Govt health services” శంకరపట్నం, డిసి ప్రతినిధి
జిల్లా ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. వెంకటరమణ సూచించారు. గురువారం మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ను, తాడికల్ గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, “ప్రజలు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ వైద్యశాలల సేవలను వినియోగించుకుంటే ఆర్థికంగా భారం తక్కువగా ఉంటుంది. పరిశుభ్రత, పచ్చదనం, పారిశుద్ధ్యం పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి,” అని తెలిపారు.

వర్షాకాలం–ఎచ్చరిక అవసరం
ఈ వర్షాకాలంలో నీటి నిల్వల కారణంగా సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా డెంగ్యూ వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. అలాగే ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గ్రామంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలకు మార్గదర్శనం ఇవ్వాలన్నారు.

తనిఖీలో పాల్గన్నవారు
ఈ తనిఖీలకు జాతీయ కీటకనిర్మూలన అధికారి డాక్టర్ ఉమాశ్రీ, మండల వైద్యాధికారి డా. గొట్టే శ్రావణ్ కుమార్, సూపర్వైజర్ సరోజినీ దేవి, ఏఎన్ఎం వినోద, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *