Vanamahotsavam” పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ.. మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి

Vanamahotsavam”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు ప్రధాన మార్గమని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం వనమహోత్సవం సందర్భంగా మానకొండూర్ మండలంలోని చెరువు గట్టు (ట్యాంక్ బండ్) మరియు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి, నీరు పోశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్వినీ తనాజీ వాకడే, ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, “కాలుష్యం వేగంగా పెరుగుతుండటంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దీన్ని ఎదుర్కొనాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.

ప్రకృతి పరిరక్షణ మన జీవన విధానంగా మారాలని, అందరూ భాగస్వాములుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్, అటవీశాఖ రేంజర్ బుర్ర లత, ఎంపీడీఓ వరలక్ష్మి, ఇతర అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *