Help for” చిన్నారిని ఆదుకోండి… మన చిన్న సహాయం… ఒక జీవితానికి వెలుగు.

Help for”

కాజీపేట, ఏప్రిల్ 8:
ఒక చిన్నారి కన్నీటి కథ… ఆటలాడుతూ నవ్వుతూ తిరగాల్సిన వయస్సులో, ఆ చిన్నారి నడవలేక నరకయాతన అనుభవిస్తోంది. మానసిక స్థితి సరిగా లేని యశ్వత (వయస్సు: 5) ఇప్పుడు సమాజం దయపై ఆశల్ని పెట్టుకుంది.

కాజీపేట పట్టణంలోని బాపూజీనగర్‌కు చెందిన తోకల సర్వేశ్ మరియు ప్రేమలత దంపతుల కుమార్తె యశ్వత పుట్టుకతోనే మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఇప్పటివరకు చాలామంది డాక్టర్లను సంప్రదించి సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినా, పూర్తిగా స్వస్థత సాధించలేదు. యశ్వత నడవలేని స్థితిలో ఉంది. ఆమెకి కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సర్వేశ్ దంపతులకు, కార్పొరేట్ హాస్పిటల్ ఖర్చులు భరించడం సాధ్యంకాదు. తమ కన్నబిడ్డను కాపాడుకోవడానికైనా చేతిలో తగిన ఆర్థికవనరులు లేక గుండెల్లో రాళ్లేసుకుని చూస్తుండాల్సి వస్తోంది.

“దయచేసి ఎవరి సహాయం అయినా మా చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టగలదు,” అని విన్నవిస్తున్నాడు తండ్రి సర్వేశ్.

మానవతా దాతలు ముందుకు రండి

మన సహాయం ఓ చిన్నారి జీవితాన్ని వెలిగించగలదు. ఓ తల్లి నిద్రలేని రాత్రులను సాంత్వనపరచగలదు. ఓ తండ్రి కన్నీళ్లకు ముగింపు ఇవ్వగలదు.

దాతలు తమ సహాయాన్ని క్రింద ఇచ్చిన ఖాతాలో జమ చేయవచ్చు:

  • ఖాతాదారు పేరు: కల్వల ప్రేమలత

  • బ్యాంక్ పేరు:  యూనినియన్ బ్యాంక్, కాజీపేట బ్రాంచ్

  • ఖాతా నంబర్: 10100001805

  • IFSC కోడ్: UBIN0802999

  • గమనిక: సహాయంగా పంపిన వివరాలు వాట్సప్ నెంబర్ 63008 12559 (Sarvesh)కి పంపవచ్చు.

  • ఫోన్‌పే లేదా గూగూల్‌పే ద్వారా మీ స‌హాయాన్ని అందించొచ్చు నెంబ‌ర్ 63008 12559

 


మన చిన్న సహాయం… ఒక జీవితానికి వెలుగు.

మన చుట్టూ ఉన్న బాధితులకు మనం చీకటిలో కాంతివంతమైన దీపం కావచ్చు. యశ్వత కోసం ఆ కాంతి మీరు అవుతారా..?

సూపర్ డీల్ అలర్ట్!
హోమ్ డెకర్ ఫ్యాన్స్ కోసం

Homesake® రెట్రో మెటల్ టేబుల్ ల్యాంప్
️ బెడ్‌సైడ్, లివింగ్ రూమ్, గిఫ్ట్ ఐడియా
ప్లీటెడ్ ఫాబ్రిక్ షేడ్ తో స్టైలిష్ లుక్!

ధర: ₹349 మాత్రమే (78% తగ్గింపు )
⭐ రేటింగ్: 4.1/5 (165 మంది రివ్యూస్)

ఇది హౌస్‌వార్మింగ్ గిఫ్ట్ కి సూపర్!
అమెజాన్‌లో కొనేందుకు  https://amzn.to/4fh5y4l లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *