యానిమల్‌’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది ర‌ణ్‌బీర్‌, రష్మికల కాంబినేషన్‌

ఇండియాస్‌ మోస్ట్‌ ఎవైటెడ్‌ ఫిలిం ‘యానిమల్‌’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా జంటగా.. ‘అర్జున్‌ రెడ్డి’ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రూపొందించారు. రా అండ్‌ రస్టిక్‌ యాక్షన్‌తో వచ్చిన ఈ చిత్ర ట్రైలర్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతూ.. టాప్‌లో ట్రెండింగ్‌ అవుతోంది. రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా ‘అర్జున్‌ రెడ్డి’ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమా మాములుగా ఉండదనేలా ఫీల్‌ని ఇవ్వడంతో పాటు.. దేశ ప్రజలంతా సినిమా కోసం ఎదురు చూసేలా చేశాయి. రా అండ్‌ రస్టిక్‌ యాక్షన్‌తో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా.. నిమిషాల్లోనే మిలియన్లలో వ్యూస్‌ సంపాదించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. బుధవారం సెన్సార్‌ పూర్తి చేసుకుని, సెన్సార్‌ నుంచి  సర్టిఫికెట్‌ పొందింది. రన్‌ టైమ్‌ కూడా ఆశ్చర్యపోయేలా ఉండటంతో.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ముంబైలో స్కీన్రింగ్‌ చేయగా చిత్ర యూనిట్‌, పలువురు ప్రముఖులు చూసి ట్రెమండస్‌ రివ్యూలు ఇచ్చారు. రణబీర్‌ కపూర్‌ విశ్వరూపం చూస్తారంటూ కామెంట్స్‌ చేశారు. అ వీడియోలు, పోస్టులు నిన్నటి నుంచి సోషల్‌ విూడియాలో ట్రెండింగ్‌ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ ట్రెండింగ్‌లో టాప్‌లో దూసుకెళుతోంది. అంతకుముందే రిలీజ్‌ చేసిన టీజర్‌తో సినిమాలో ఏం ఉండబోతుందో చుఛాయగా చెప్పగా యావత్‌ దేశం దాన్ని థ్రిల్‌ ఫీలయింది. హాలీవుడ్‌ జాన్‌ విక్‌ టైప్‌లో ఈ యానిమల్‌ తీర్చిదిద్దారని, యాక్షన్‌ సీన్స్‌ మరో లెవల్లో ఉంటాయన్నట్టుగా హైప్‌ తీసుకువచ్చారు. దానికి తగ్గట్టుగానే తాజాగా ఇప్పుడే విడుదల చేసిన ట్రైలర్‌.. టీజర్‌ను మించి గూస్‌బంప్స్‌ తెచ్చేలా ఉంది. 3నిమిషాల 32 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌లో రణబీర్‌ను దర్శకుడు ఇండియన్‌ స్కీన్స్‌ప్రై నెవర్‌ భీఫోర్‌ అన్నట్టుగా చూపించాడు. ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌తో పాటు తండ్రి సెంటిమెంట్‌ను బాగా వాడినట్లు తెలుస్తోంది. తండ్రికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా కొడుకు పగ తీర్చుకోవడం చుట్టూ కథను నడిపించినట్టుగా ట్రైలర్‌ను కట్‌ చేశారు. ఇక చివరలో వచ్చే గన్‌ ్గక్ష్మిర్‌ మాత్రం మరో స్థాయిలో ఉంది, ఖైదీ, కేజీఏఫ్‌ గన్నులను మించిన గన్నును ఈ సినిమాలో వాడారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఆకలి తీర్చే విధంగా ఈ ట్రైలర్‌ ఉంది. ఇక సినిమాపై ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి.

 

సినిమా షూటింగ్‌లో హీరో సూర్య‌కు గాయాలు

రెండు చోట్ల‌ ఎవ‌రెవ‌రు పోటీ చేశారు… ఎవ‌రు గెలిచారు..

త్రిషకు మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *