Pondicherry News” అసలే ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే బయటకు వెళ్లే పరిస్థితే లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంకా సీటీల్లో అయితే చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేచి ఉంటే చుక్కలు కనపడుతుంటాయి. (Pondicherry News) పాండిచ్చేరిలో రోడ్లపై సిగ్నల్ వద్ద వాహనదారుల కోసం పాండిచ్చేరి పబ్లిక్ వర్క్స్ గ్రీన్ మ్యాట్‌ను నీడనిచ్చేలా ఏర్పాటు చేశారు. సిగ్నల్ ల వద్ద ఆగినప్పుడు ఎండ దెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వాహనదారులు ఎంచక్కా నీడలో సిగ్నల్ పడినంత సేపు సేదతీరుతున్నరు. దీనికి సంబంధించిన వీడియోను Indian Tech & Infra వారు తనఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి Good initiative by Pondicherry PWD అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ కంటెంట్‌ను పోస్ట్ చేసే సమయానికి 9 లక్షలకు పైగా ఈ వీడియో ను తిలకించారు. ఇది కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు భువనేశ్వర్‌లోనూ ఇలాంటి ఏర్పాటే చేశారని మరొకరు రాశారు. చిన్న ట్రాఫిక్ ప్రాంతాలలో సాధ్యమవుతుంది, కానీ అధిక ట్రాఫిక్ ఉన్న మెట్రో నగరాల్లో సాధ్యం కాదని మరొకు సూచించారు.
Good initiative by Pondicherry PWD. 👏
(📹-@Jayaram9942Blr) pic.twitter.com/OhED19Lfug
— Indian Tech & Infra (@IndianTechGuide) May 2, 2024
భువనేశ్వర్ సిటీ లో ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్
ఇవి కూడా చదవండి
Bulls Viral Video”బట్టల షాపును నిండాముంచిన ఎద్దుల కొట్లాట.. వీడియో వైరల్
Jagityal crime” కోడలి గొంతు కోసి చంపిన మామ
Deer Viral Video”జీవితం అంటే ఏమిటి……ఎప్పటికీ ఆశ వదులుకోవద్దు..వీడియో వైరల్
Karnataka crime news”మార్కుల గొడవ.. కత్తులతో పొడుచుకున్న తల్లీ కూతుళ్ళు.. బిడ్డ మృతి
Helicopters Collided” గాలిలో ఘోర ప్రమాదం..రెండు హెలికాప్టర్లు ఢీ.. షాకింగ్ వీడియో