Khammam Cirme News” ఆస్తి కోసం క‌న్న‌తల్లిని, క‌న్న‌ కూతుళ్ల హ‌త్య

Khammam Cirme News

Khammam Cirme News”  మాన‌వ సంబంధాలు మంట‌గ‌లుస్తున్నాయి. ఆస్తి ముందు ఆప్యాయ‌త‌లు కాన‌రావ‌డం లేదు. క‌న్న‌వారిని, క‌డుపున పుట్టిన వారిని దారుణంగా హ‌త్య చేస్తున్నారు. అరెక‌రం భూమి, ఇల్లుకోసం క‌న్న త‌ల్లిని, క‌డుపున పుట్టిన ఇద్ద‌రు ఆడ‌బిడ్డ‌ల‌ను దారుణంగా చంపాడో వ్య‌క్తి . వివ‌రాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా త‌ల్లాడ మండ‌లం గోపాల పేటలో పిట్టల వెంకటేశ్వర్లుకు దివ్యాంగు రాలు అయిన తల్లి పిచ్చమ్మ(60), కూతుళ్లు నీరజ(11), ఝాన్సీ(6) ఉన్నారు. రెండేళ్ల క్రితం వెంక‌టేశ్వ‌ర్లు భార్య కనకదుర్గ మృతి చెందింది.

Serial Actor”త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

అయితే ప్రభుత్వం ఇచ్చిన రెండు పడక గదుల ఇల్లు, ఎకరం భూమి ఉంది. ఎక‌రంలో అత‌ని త‌ల్లి ఇద్ద‌రు మ‌నుమ‌రాళ్ల పేరిట చెరే పది గుంటల ఇద్దరు పిల్లలకు దక్కేలా పెద్దల సమక్షంలో ఒప్పందం రాసుకున్నారు. మిగిలిన అరెక‌రం త‌ల్లి త‌న పేరు మీదే ఉంచుకున్న‌ది. ఈ క్ర‌మంలో వెంకటేశ్వర్లు తల్లాడకు చెందిన రెండో వివాహం చేసుకొని మొద‌టి భార్య పిల్లలను, తల్లిని వదిలేసి ఖమ్మంలో కాపురం పెట్టాడు. వెంకటేశ్వర్లు కొంతకాలంగా చెడు వ్యసనాలతో అప్పులపాలయ్యాడు వాటిని తీర్చేందుకు తల్లి పిచ్చమ్మ పేరున ఉన్న దాదాపు అరెకరం పొలాన్ని అమ్మాలంటూ అప్పుడప్పుడు వచ్చి గొడవపడేవాడు. మనవరాళ్ల భవిష్యత్తు దృష్ట్యా అమ్మేది లేదంటూ ఆమె నిరాకరిస్తూ వచ్చింది. ఆస్తి కోసం ముగ్గురినీ అడ్డు తొలగించుకోవాలని శుక్ర‌వారం అర్ధరాత్రి ఇంటికి వచ్చి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లనూ చంపేసి పరారయ్యాడు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Viral video” న‌డిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చ‌ల్లార్చిన యువ‌కుడు..వీడియో వైర‌ల్

Fire Accdent” బ‌స్సు ద‌గ్ధం.. కాలిబూడిదైన‌ 8 మంది..

Serial Actor”త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Bangalore Crime” ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరింపు వీడియో కాల్‌.. ఫోన్ జారి స్టూల్ జ‌రిగి నిజంగానే..

Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

North korea” రెడ్ క‌ల‌ రెడ్ క‌ల‌ర్ లిప్‌స్టిక్‌పై ఉత్త‌ర కొరియాలో నిషేధం

Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభ‌త్సం.. కూలిన హోర్డింగ్‌.. వీడియోలు వైర‌ల్

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *