Israel” ఇజ్రాయిల్ దేశంలో కార్చిచ్చు భీకరంగా వ్యాపించింది. జెరూసలేం నగరం పక్కనన్ను అడవిలో ఈ అగ్ని చెలరేగింది. బుధవారం జెరూసలెం నగరానికి సమీపాన కొండల్లో మంటలు ప్రారంభమయ్యాయి. 3 వేల ఎకరాల నుంచి 5 వేల ఎకరాల వరకు గల అటవీ ప్రాంతం మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తుంది.
24 గంటల్లో వేల మంది స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతా లకు తరలించారు. దేశ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా దీనిని అధికారులు అభివర్ణిస్తున్నారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడ్డారు. ప్రాణ నష్టం వివరాలు తెలియరా లేదు. దీంతో ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు అదుపులోకి రావడం కష్టంగా ఉంది. జెరూసలెంను రక్షించుకోవడం ప్రస్తుత ప్రాధాన్యాంశమని బెంజమెన్ నెతన్యాహు చెప్పారు. టెల్ అవీవ్, జెరూ సలెంను కలిపే రోడ్డును అధికారులు మూసివే శారు. రహదారులపై దట్టమైన పొగ కమ్ముకుంది. రోడ్డు మార్గంలో మంటలు చుట్టుముట్టడంతో, పలువురు తమ వాహనాలు విడిచి పెట్టి పరిగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. సహాయక చర్యల కోసం ఆదేశ సైన్యం రంగంలోకి దిగింది.
దీంతో పాటు మంటలను ఆర్పేందుకు సాయం చేయాలని అంతర్జాతీయంగా కోరారు. గ్రీస్, సైప్రస్, క్రొయేషియా మరియు ఇటలీ నుండి అగ్నిమాపక విమానాలను పంపారు, ఉక్రెయిన్, స్పెయిన్, ఫ్రాన్స్ మరియు మరి కొన్ని ఇతర దేశాలు కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్టు ఇంటర్నేషనల్ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఆయా దేశాల నుంచి అగ్నిమాపక విమానాలు ఇజ్రాయిల్‌కు వచ్చాయి. అయతే మంటలు వ్యాప్తి చెందడానికి వాస్తవ కారణమేమిటని తెలియరాలేదు. ఈ క్రమంలో మంటల వ్యాప్తికి కారణమని 18 మందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మంటల కారణంగా 13 మంది గాయపడ్డట్టు తెలుస్తుంది. ఈ అగ్రి ప్రమాదం ఇజ్రాయిల్ దేశ చరిత్రలోనే అత్యంత పెద్దదిగా అక్కడి ప్రభుత్వం భావిస్తున్నది.
