Tirupati”తిరుపతి, జూలై 1:
చిత్తూరు జిల్లా తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. తిరుచానూరు ప్రాంతంలో ఇద్దరు యువకులు మద్యం సేవించేందుకు కారులోకి వెళ్లారు. ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు కారు మూతపై కవర్ వేసి, ఏసీ ఆన్ చేసి మద్యం సేవించారు. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న యువకులు కారు ఎంజిన్ ఆగిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసుల సమాచారం ప్రకారం, మృతులు దిలీప్, వినయ్‌గా గుర్తించారు. వారు కారులో మద్యం సేవించి నిద్రించగా, పెట్రోల్ అయిపోవడంతో కారులోని ఏసీ ఆగిపోయింది. దీంతో కారు లోపల ఆక్సిజన్ లేని పరిస్థితి ఏర్పడి ఊపిరాడక మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
