Delhi News” మ‌హిళ‌పై ఎద్దు ఘోర దాడి.. ధైర్యంగా ఎదుర్కొన్న మ‌హిళ‌వీడియో వైర‌ల్

Delhi News” దేశ రాజ‌ధాని ఢిల్లీలోని గ‌ల్లీలో ఓ మహిళపై విచ్చలవిడిగా ఎద్దు దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన మొత్తం కెమెరాకు రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటు చేసుకుంది. ఢిల్లీలోని అయా నగర్‌లోని గాలి నంబర్ 8, ఫేజ్ 4లో చోటు చేసుకుంది. ఆ మహిళ తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఇరుకైన వాడ‌లో నడుచుకుంటూ వెళుతున్న‌ది. అక్క‌డే ఉన్న ఓ ఎద్దు ఆమెపై విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేసింది. ఆమె ఎదురుగా నిలబడిన ఎద్దు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగింది. ఆ మహిళను నేలపైకి నెట్టి ఈడ్చుకెళ్లింది. ఆమె ధైర్యంగా ఎద్దును కొమ్ములు, నోటితో పట్టుకుంది. దీంతో ఎద్దు ఆమెపై దాడి చేయలేకపోయింది. ఆమె ఎద్దును పట్టుకొని సహాయం కోసం అరుస్తూనే ఉంది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని కర్రలతో వచ్చి ఎద్దును తరిమికొట్టే ప్రయత్నం చేశారు. మరొక వ్యక్తి వచ్చి ఎద్దును దాని కొమ్ముతో పట్టుకునే వరకు ఆ మహిళ ఎద్దును పట్టుకుంది. మరో వ్యక్తి రంగంలోకి దిగి ఆ మహిళను ఎద్దుపై నుంచి లాగడం ప్రారంభించాడు. ఎద్దు దాడిలో గాయపడటంతో ఆ మహిళ నిలబడలేక పోయింది. ఈ వీడియో తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

TOSHIBA TV” తోషిబా 32 ఇంచుల టీవీ 12,999 రూపాయ‌ల‌కే..

Bmtc Bus” డ్రైవ‌ర్ కు గుండెపోటు.. ప్ర‌యాణికుల‌ను కాపాడిన కండ‌క్ట‌ర్ .. వీడియో

Noise Buds” నాయిస్ ఇయ‌ర్ బ‌డ్స్ పై భారీ త‌గ్గింపు..

08.11.2024 D.C Telugu Cinema

07.11.2024 D. C Telugu Cinema

Tiger Jump” పెద్దపులి లాంగ్ జంప్‌.. వీడియో వైర‌ల్

Realme Phone” రీయ‌ల్ మి 5జీ ఫోన్ 12,498 రూపాయ‌ల‌కే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *