Karimnagar news” జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె వెంకటేష్ గారు తణుకు మహేష్ న్యాయవాది ని డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ గా కొండ్ర మౌనిక నియమితులయ్యారు. జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఆర్థిక స్థోమత లేని నిందితులకు వీరు ఉచితంగా న్యాయ సహాయము అందిస్తారు, తణుకు మహేష్ న్యాయవాది రెండవసారి డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ గా నియమితులయ్యారు. కాగా ఇట్టి లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ గారు మరియు కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు గారు అభినందించారు.

