Karimnagar news” నిరుద్యోగుల ఆశలు అడియాశలు చేసింది కాంగ్రెస్, బిజేపి
-కార్పొరేట్ లాభాల కోసం విద్యా వ్యవస్థను బలి చేసే వారి కోసం కాదు
-పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యాయమైన ఓటుతో మార్పుకు మద్దతివ్వాలి
-ఓటును అమ్ముకోవద్దు, నమ్మకాన్ని గెలిపించండి
-స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్
బీసీలను అణగదొక్కుతున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, కరీంనగర్-నిజామాబాద్- అదిలాబాద్-మెదక్ ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినట్లు డాక్టర్ బండారి రాజ్ కుమార్ ప్రకటించారు. మంగళవారం నగరంలోని వైద్య వీధిలో హెూటల్ రాగలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక సేవే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన డాక్టర్ రాజ్ కుమార్, కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్యసేవలు అందించానని గుర్తుచేశారు. తన సేవలను గుర్తించిన వైద్య వర్గాలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎంపికకు తనను సిఫార్సు చేశాయని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పట్టభద్రులు, నిరుద్యోగ యువతకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని ఆయన విమర్శించారు. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరి, పైగా పదవీ విరమణ వయసు పెంచే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందికి పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం అభ్యంతరకరమన్నారు. పట్టభద్రుల హక్కుల కోసం పోరాడే నా తరహా సామాన్యునికి మద్దతుగా నిలవాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. బీసీ వర్గాలు, మున్నూరు కాపు కుల సంఘం, వైద్య వర్గాలు, అనుబంధ రంగాలకు చెందిన ఉద్యోగులు తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే డబ్బు, కులం, మతం, బంధుత్వాలకు అతీతంగా నిక్కమైన మార్పుకు నాంది పలికేలా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ కుమార్ సతీమణి డాక్టర్ సాయి కృష్ణ ప్రియా మాట్లాడుతూ, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేరలన్నారు. ఓటును అమ్ముకోవద్దు. నమాజ సేవే ధ్యేయంగా పనిచేస్తున్న డాక్టర్ బండారి రాజ్ కుమార్ను మొదటి ప్రాధాన్యత ఓటుగా గెలిపించి, నైతిక విలువలకు పట్టం కట్టాలని కోరారు. ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాన్యుల గొంతుకగా నిలిచే వ్యక్తికి అండగా నిలబడాలని పట్టభద్రులకు డాక్టర్ బండారి రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సీరియల్ నెంబర్ 37 కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
