కరీంనగర్ కు చెందిన కవయిత్రి ఉపాధ్యాయిని పత్తెం వసంత రచించిన ఆకాశమే అవధిగా కవితా సంపుటి ఆవిష్కరణను శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకట రమణ సంపుటిని ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ కవి ఆశారాజు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..ఇప్పటికే అనేక రచనలు చేసిన వసంత తాను వెలువరించిన ఆకుపచ్చని ఆశ, ఆలోచనల రెక్కలు, ఆకాశమే అవధిగా సంపుటి లతో ప్రత్యేక గుర్తింపును పొందారని ప్రశంసించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతున్న విశిష్ట సందర్భంలో వసంత తన నూతన సంపుటిని ఆవిష్కరించినందుకు వారు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ రచయితలు నేలంటి మధు, నాగభూషణం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆకాశమే అవధిగా ఆవిష్కరణలో సాహితీవేత్తలు
…………………………………………………….
ఇవి కూడా చదవండి
Tiger Viral Video” మానవా ఇటు చూడు.. పులి నేర్పిన పాఠం
Thiurupathi Zoo Park” సింహంతో ఆటలా… ప్రాణాలొదిలాడు..
Robbery in Gold Shop” పట్టపగలే బంగారం షాప్‌లో దోపిడీ.. సీసీ కెమెరాల్లో వీడియో రికార్డు..