Chandiyagam Karimnagar” చండియాగానికి రావాల‌ని కేంద్ర స‌హాయ మంత్రికి ఆహ్వానం

Chandiyagam Karimnagar” కరీంనగర్:    ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ దగ్గర ఉన్న తపాలా నర్సింహ స్వామి ఆలయంలో మహా చండీయాగం నిర్వహించబోతోంది.  ఈ సందర్భంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఈ చండీయాగంలో పాల్గొని ఉద్యమకారుల అండగా నిలవాలని ఆదివారం ఆహ్వానించిన‌ట్టు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి  తెలిపారు. కుమారస్వామి  మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను  అమలు చేయాలని ఈ యాగం నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు.

 అలాగే, బిజెపి ప్రభుత్వం పట్ల కూడా ఒత్తిడి పెంచాలని,  ఉద్యమకారుల  వాణిని గౌరవిస్తూ వారి సంకల్పాలను గౌరవించాలని అభ్యర్థించారు.

 ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ మహిళా అధ్యక్షురాలు అయిల ప్రసన్న, జిల్లా ఉద్యమకారుల ఫోరం అధికార ప్రతినిధి రాసమల్ల శ్రీనివాస్, నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *