Local News వార సంతను పరిసరాల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…
గద్దపాకలో వారం సంత
తాజా మాజీ వైస్ ఎంపీపీ రమేష్….

శంకరపట్నం డిసీ ప్రతినిధి
వార సంతను పరిసరాల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శంకర పట్టణం మండల పరిషత్ తాజా మాజీ వైస్ ఎంపీపీ పులికోట రమేష్ కోరారు. కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండలం, గద్దపాక గ్రామంలో ఏర్పాటు చేసిన వార సంతను గురువారం రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. గద్దపాక గ్రామంలో ప్రతి గురువారం వారం సంత నిర్వహించడం జరుగుతుందన్నారు. వారం సంతలో ప్రజలకు కావలసిన నిత్యవసర సరుకులతో పాటు ఇతర గృహ ఉపయోగ వస్తువులు విక్రయించడం జరుగుతుందని పరిసరాల గ్రామాలకు చెందిన ప్రజలు వారం సంతాలో తమ గృహ వినియోగానికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సింగిల్ విండో చైర్మన్ గుర్రాల తిరుపతిరెడ్డి, తెలంగాణ ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ శనిగరపు యువరాజ్, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
//////////////////////////
గ్రామ గ్రామాన కార్మిక దినోత్సవం. మేడే ఉత్సవాలు..
లాల్ జెండా మయమైన గ్రామాలు…

శంకరపట్నం డిసీ ప్రతినిధి
గ్రామ గ్రామాన లాల్ జెండాలు ఎగురవేసి గ్రామాలను కార్మికులు నాయకులు మేడే ను జరుపుకున్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడే సందర్భంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని, అన్ని గ్రామాల్లో కార్మికులు లాల్ జెండాలను కార్మిక జెండాలను ఎగురవేసి మేడే ఉత్సవాలను జరుపుకున్నారు. మండలంలోని కేశవపట్నం, గద్దపాక, మొలంగూర్ , కొత్తగట్టు లింగాపూర్, కాచాపూర్ తోపాటు గ్రామాల్లో గల హమాలీ కార్మికులు కార్మికులు కర్షకులు వివిధ కార్మిక సంఘాల నాయకులు హాజరై మేడే ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కర్షకులు హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
///////////////////////////////////////////////////////////////////
శంకరపట్నం తాసిల్దార్ గా రమేష్ బాబు బాధ్యతల స్వీకరణ…

శంకరపట్నం: డిసి ప్రతినిధి
శంకరపట్నం మండల తాసిల్దార్ గట్ల రమేష్ బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబుకు ఆర్ ఐ లు ప్రత్యూష, బాలకృష్ణ, కార్యాలయం సిబ్బంది. పుష్పవిత్యం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
//////////////////////////////////////////////////////////////////////
అట్టహాసంగా ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో కేపీఎల్ 7 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. ..
ఆదర్శ యూత్ సెక్రెటరీ అభిలాష్ గౌడ్

శంకరపట్నం డిసి ప్రతినిధి
వేసవి సెలవులు పురస్కరించుకొని శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నం జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో కేపీఎల్ 7 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ క్రీడాకారుడు ఏనుగుల అనిల్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి కాలం. ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించిన అభినందనీయమని, క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడతాయని, క్రీడలను క్రీడాకారులు సద్విని చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యూత్ సెక్రెటరీ బొంగోని అభిలాష్ గౌడ్, సీనియర్ క్రీడాకారులు మోయిన్, నాయకులు గోడిషాల ప్రవీణ్ గౌడ్ , బొంగోని చందు,. మధుకర్, సాయి యూత్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు.
